ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగడంతో ఎన్డీయే కూటమి (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నెల 26వ తేదీన జరగనున్న 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కూటమి నేతలు సీట్ల సర్దుబాటును పూర్తి చేశారు. టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కసరత్తు అనంతరం మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించారు. మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థలకు గాను మూడు పార్టీలు పరస్పర అవగాహనతో స్థానాలను పంచుకున్నాయి.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా

టీడీపీ తరఫున ఒక కార్పొరేషన్ మేయర్, 14 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్మన్ స్థానాలకు అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేసింది. మంగళగిరి - తాడేపల్లి కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా పేరం ఏడుకొండలును ప్రకటించారు.
మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులు
తణుకు: బసవ రామకృష్ణ
పాలకొల్లు: ఆబోతుల ఉషారాణి
నరసరావుపేట: ఎన్. రూపేశ్ గుప్తా
గుడివాడ: మారీదు కరుణ
శ్రీకాళహస్తి: పేట బాలాజీ
తాడిగడప: పీతా గోపీచంద్
పొన్నూరు: కండ్రు విజయలక్ష్మి
కందుకూరు: పిడికిటి వెంకటేశ్వర్లు
ఆమదాలవలస: కూన ప్రమీల
గూడూరు: చౌటూరి శిరీష
నగర పంచాయతీ ఛైర్మన్ అభ్యర్థులు:
చింతలపూడి: కె. ఎస్తేర్ రాణి
పొదిలి: వరికుంట్ల అనిల్ కుమార్
అల్లూరు: తోటకూర సునీల్ కుమార్
బి. కొత్తపేట: కుడుము శ్రీనివాసులు
జనసేన అభ్యర్థుల జాబితా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆమోదంతో ఆ పార్టీ కేంద్ర కార్యాలయం 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో రెండు కీలక కార్పొరేషన్లు ఉన్నాయి. శ్రీకాకుళం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి డాక్టర్ దానేటి రాధా రాణి, కాకినాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ఆకుల భవానిగా ప్రకటించారు.
మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులు
రాజాం: బనిశెట్టి సౌజన్య లత
{{/usCountry}}రాజాం: బనిశెట్టి సౌజన్య లత
{{/usCountry}}భీమవరం: డాక్టర్ చుండూరి మల్లేశ్వరి
తాడేపల్లిగూడెం: పాలూరు వెంకటేశ్వర రావు
భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల జాబితా
బీజేపీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మూడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను అధికారికంగా వెల్లడించారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవిని ప్రకటించారు.
మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులు
కావలి: గుండ్లపల్లి భరత్ కుమార్
బాపట్ల: ఇస్కా సునీల్ కుమార్
పట్టణ ఓటర్ల నాడిని పట్టుకునేందుకు సామాజిక సమీకరణాలు, స్థానికంగా అభ్యర్థులకున్న పట్టు, గెలుపు అవకాశాలను ప్రామాణికంగా తీసుకుని కూటమి నాయకత్వం ఈ ఎంపికలు చేపట్టింది. జాబితాలో మహిళలకు పెద్దపీట వేయడం విశేషం. అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో క్షేత్రస్థాయి ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 26న జరగనున్న పోలింగ్ ద్వారా పట్టణ స్థానిక సంస్థలపై పట్టు సాధించాలని ఎన్డీయే కూటమి భావిస్తోంది.