ఏపీ పుర పోరు : 23 పట్టణ స్థానిక సంస్థల మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే

AP Municipal Elections : సెకండ్ ఫేజ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకుకూటమి అభ్యర్థులను ప్రకటించారు. ఈనెల 26వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

Published on: Nov 15, 2026, 21:07:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగడంతో ఎన్డీయే కూటమి (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నెల 26వ తేదీన జరగనున్న 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కూటమి నేతలు సీట్ల సర్దుబాటును పూర్తి చేశారు. టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కసరత్తు అనంతరం మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించారు. మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థలకు గాను మూడు పార్టీలు పరస్పర అవగాహనతో స్థానాలను పంచుకున్నాయి.

పుర పోరు కూటమి అభ్యర్థులు
పుర పోరు కూటమి అభ్యర్థులు

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా

టీడీపీ తరఫున ఒక కార్పొరేషన్ మేయర్, 14 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్మన్ స్థానాలకు అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేసింది. మంగళగిరి - తాడేపల్లి కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా పేరం ఏడుకొండలును ప్రకటించారు.

మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులు

తణుకు: బసవ రామకృష్ణ

పాలకొల్లు: ఆబోతుల ఉషారాణి

నరసరావుపేట: ఎన్‌. రూపేశ్ గుప్తా

గుడివాడ: మారీదు కరుణ

శ్రీకాళహస్తి: పేట బాలాజీ

తాడిగడప: పీతా గోపీచంద్

పొన్నూరు: కండ్రు విజయలక్ష్మి

కందుకూరు: పిడికిటి వెంకటేశ్వర్లు

ఆమదాలవలస: కూన ప్రమీల

గూడూరు: చౌటూరి శిరీష

నగర పంచాయతీ ఛైర్మన్ అభ్యర్థులు:

చింతలపూడి: కె. ఎస్తేర్ రాణి

పొదిలి: వరికుంట్ల అనిల్ కుమార్

అల్లూరు: తోటకూర సునీల్ కుమార్

బి. కొత్తపేట: కుడుము శ్రీనివాసులు

జనసేన అభ్యర్థుల జాబితా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆమోదంతో ఆ పార్టీ కేంద్ర కార్యాలయం 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో రెండు కీలక కార్పొరేషన్లు ఉన్నాయి. శ్రీకాకుళం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి డాక్టర్ దానేటి రాధా రాణి, కాకినాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ఆకుల భవానిగా ప్రకటించారు.

మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులు

రాజాం: బనిశెట్టి సౌజన్య లత

భీమవరం: డాక్టర్ చుండూరి మల్లేశ్వరి

తాడేపల్లిగూడెం: పాలూరు వెంకటేశ్వర రావు

భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల జాబితా

బీజేపీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మూడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను అధికారికంగా వెల్లడించారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవిని ప్రకటించారు.

మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులు

కావలి: గుండ్లపల్లి భరత్ కుమార్

బాపట్ల: ఇస్కా సునీల్ కుమార్

పట్టణ ఓటర్ల నాడిని పట్టుకునేందుకు సామాజిక సమీకరణాలు, స్థానికంగా అభ్యర్థులకున్న పట్టు, గెలుపు అవకాశాలను ప్రామాణికంగా తీసుకుని కూటమి నాయకత్వం ఈ ఎంపికలు చేపట్టింది. జాబితాలో మహిళలకు పెద్దపీట వేయడం విశేషం. అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో క్షేత్రస్థాయి ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 26న జరగనున్న పోలింగ్ ద్వారా పట్టణ స్థానిక సంస్థలపై పట్టు సాధించాలని ఎన్డీయే కూటమి భావిస్తోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More