...
...
Next Story

నవంబర్ 2 నుంచి సదరం స్లాట్ల బుకింగ్.. 117 ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు

నవంబర్ 2వ తేదీ నుంచి సదరం స్లాట్ల బుకింగ్‌ తిరిగి ప్రారంభం అవుతుంది. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి 75 వేల స్లాట్లను విడుదల చేయనున్నారు.

Published on: Nov 1, 2026, 14:24:31 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. సదరం (SADAREM) వైద్య పరీక్షల నిర్వహణతో పాటు ధ్రువీకరణ పత్రాల జారీ కోసం నిలిచిపోయిన స్లాట్ల బుకింగ్ ప్రక్రియను ఈ నెల 2వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. నవంబర్, డిసెంబర్ నెలల కాలానికి గాను రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 75,000 స్లాట్లను అందుబాటులోకి తేనున్నారు. 2వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి దివ్యాంగులు తమ స్లాట్లను నమోదు చేసుకోవచ్చు.

స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి?

సదరం స్లాట్ల బుకింగ్
సదరం స్లాట్ల బుకింగ్

లబ్ధిదారులు పలు మార్గాల ద్వారా సులభంగా స్లాట్ బుక్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. స్వర్ణ గ్రామ / స్వర్ణ వార్డు సచివాలయాలు,వాట్సప్ మనమిత్ర, ఏపీ పౌర సేవా పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేయవచ్చు.

117 ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు

రాష్ట్రవ్యాప్తంగా డీఎంఈ, డీఎస్‌హెచ్ పరిధిలోని 117 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. డీఎంఈ ఆసుపత్రులలో 21 రకాల ప్రత్యేక పరీక్షల సౌకర్యం ఉన్నందున ఇక్కడ వారానికి 2 రోజులు స్లాట్లు కేటాయిస్తారు. డీఎస్‌హెచ్ ఆసుపత్రులలో వారానికి ఒక రోజు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారు.

స్లాట్ బుకింగ్ పూర్తయ్యాక ఇచ్చే రసీదుపైనే సంబంధిత ఆసుపత్రి హెల్ప్‌లైన్ నంబర్లను ముద్రిస్తారు. స్లాట్ బుక్ చేసుకున్న తేదీ నుంచి 6 నెలల్లోపు వైద్య పరీక్షలకు హాజరు కాకపోతే సదరు స్లాట్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. స్లాట్ నమోదు చేసుకునే సమయంలో వైకల్య రకాన్ని సరిగ్గా పేర్కొనాలి లేదా డాక్టర్ ధ్రువీకరణ తీసుకోవాలి. తప్పు కేటగిరీలో బుక్ చేసుకుంటే ఆ స్లాట్లను తిరస్కరిస్తారు.

పాతవి తొలగింపు

దివ్యాంగులు తమ ఇంటికి సమీపంలో ఉండే ఆసుపత్రుల్లోనే పరీక్షలు చేయించుకునేలా జోనల్ పద్ధతినే కొనసాగిస్తున్నారు. పాత స్లాట్లు, సదరం ఐడీలను తొలగించుకోవాలనుకునే వారికి ఓటీపీ ఆధారిత సదుపాయం తీసుకొచ్చారు. 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారు ఓటీపీ ద్వారా అప్పీల్ ప్రక్రియను ఉపయోగించి పాత వివరాలను రద్దు చేసుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks