NATS Donation: నాట్స్ తరఫున నిలవే నిర్మాత రాజ్ అల్లాడ, ఛైర్మన్ కిషోర్ సేవలు- దివ్యాంగులు, అనాథలకు రూ. 80 లక్షల విరాళం

NATS 80 Lakh Donation In Telugu States: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (నాట్స్) పలు విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించింది. నిడదవోలులోని హృదయాలయం కేంద్రంలో ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించడంతో పాటు దివ్యాంగుల స్వయం ఉపాధి, వైద్యానికై 80 లక్షల విరాళం అందించారు.

Published on: Sep 26, 2026, 19:12:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Producer Rajesh Allada Service Through NATS: తెలుగులో ఇటీవల వచ్చిన రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా నిలవే. ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ రాజ్ అల్లాడ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు.

నాట్స్ తరఫున నిలవే నిర్మాత రాజ్ అల్లాడ, ఛైర్మన్ కిషోర్ సేవలు- దివ్యాంగులు, అనాథలకు రూ. 80 లక్షల విరాళం
నాట్స్ తరఫున నిలవే నిర్మాత రాజ్ అల్లాడ, ఛైర్మన్ కిషోర్ సేవలు- దివ్యాంగులు, అనాథలకు రూ. 80 లక్షల విరాళం

నాట్స్ తరఫున సేవలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఛైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ రాజ్ అల్లాడ, న్యూజెర్సీ చాప్టర్ కో ఆర్డినేటర్ సాయి గంగుల సొసైటీ తరఫున సేవలు అందిస్తున్నారు. వీరంత కలిసి సెప్టెంబర్ 20న నిడదవోలులోని “హృదయాలయం” ప్రత్యేక పాఠశాల, పునరావాస కేంద్రాన్ని సందర్శించారు.

రూ. 80 లక్షల విరాళం

ఈ సందర్భంగా భవనం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను వారు ప్రారంభించారు. “సంబరం లో సేవ” కార్యక్రమంలో భాగంగా నాట్స్ రూ.80 లక్షల విరాళాన్ని అందించింది. ఈ మొత్తాన్ని పలు సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగించినట్లు నాట్స్ వెల్లడించింది.

పాఠశాల, పునరావాస కేంద్రంలో సదుపాయాల పరిశీలన

కిషోర్ కంచర్ల, రాజ్ అల్లాడ ప్రత్యేక మానసిక వికలాంగులైన చిన్నారులతో మమేకమై, వారికి అందుతున్న పునరావాసం, బ్రిడ్జి కోర్సు, ఫిజియోథెరపీ సేవలను పరిశీలించారు. చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేసి, పాఠశాల, పునరావాస కేంద్రంలోని సదుపాయాలను పరిశీలించారు. మారుమూల, గిరిజన ప్రాంతాల్లోని దివ్యాంగులకు సైతం సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందని నాట్స్ ప్రతినిధులు పేర్కొన్నారు.

స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమం

దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమంలో భాగంగా తొర్రేడు గ్రామంలో గోపి (షాప్ నంబర్ 162), వెంకటానగర్‌లో దేవదాసు చినబాబు (షాప్ నంబర్ 161)లకు కేటాయించిన కిరాణా దుకాణాలకు నాట్స్ ఒక్కొక్కదానికి రూ.1.30 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఈ రెండు దుకాణాలను కిషోర్ కంచర్ల, రాజ్ అల్లాడ, సాయి గంగుల ప్రారంభించారు.

మెడికల్ కిట్లు పరిశీలించిన రాజ్ అల్లాడ

వెన్నెముకకు గాయాలై మంచానికే లేదా వీల్‌చైర్‌కు పరిమితమైన బాధితులకు హోప్4స్పందన అందిస్తున్న నెలవారీ మెడికల్ కిట్ కార్యక్రమానికి కూడా నాట్స్ సహకరిస్తోంది. హైదరాబాద్‌లో సినీ నిర్మాత రాజ్ అల్లాడ ఈ కిట్లను పరిశీలించారు.

13 రకాల అత్యవసర వస్తువులు

యూరినల్ బ్యాగులు, డైపర్లు, క్యాథిటర్లు, కాటన్ రోల్స్, బెటాడిన్, డెటాల్, గ్లౌజులు తదితర 13 రకాల అత్యవసర వస్తువులు ఇందులో ఉన్నాయి. అనంతపురంలోని ఆశ్రయ అనాథ ఆశ్రమం, హైదరాబాద్ నాదర్‌గుల్‌లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమం లో శాశ్వత ఆశ్రయాల కోసం కూడా నాట్స్ సహకారం అందిస్తోంది.

డాక్టర్ రఘు ఆరికపూడి సమన్వయంతో నిర్వహణ

ఈ సేవా కార్యక్రమాలను హోప్4స్పందన ఆంధ్ర–తెలంగాణ సమన్వయకర్త డాక్టర్ రఘు ఆరికపూడి సమన్వయంతో నిర్వహిస్తున్నారు. నిడదవోలు, రాజమండ్రి లో జరిగిన సామాజిక సేవల్లో హృదయాలయం వ్యవస్థాపకులు డా గణేష్ బాబు గారు, ఆర్గనైజర్ డాక్టర్ బలగం విశాలక్ష్మీ గారు, దయ్యాల మహేష్ గారు పాల్గొన్నారు.

ప్రవాస భారతీయులకు నాట్స్ కృతజ్ఞతలు

సామాజిక సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రవాస భారతీయులకు నాట్స్ నాయకత్వం కృతజ్ఞతలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో సమాజ సంక్షేమానికి తమ సేవలను మరింత విస్తరించేందుకు నాట్స్ కట్టుబడి ఉందని నాయకులు పేర్కొన్నారు..

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More