OTT Telugu: ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ లవ్ డ్రామా- 9.1 రేటింగ్- 3 మనసుల మధ్య పోరాటం, హత్తుకునే డైలాగ్స్!

OTT Telugu Romantic Drama: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ లవ్ డ్రామా చిత్రం మరువ తరమా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. వాలంటైన్స్ డే కానుకగా మొన్నటి (ఫిబ్రవరి 14) నుంచి మరవ తరమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. 9.1 రేటింగ్ సాధించిన మరువ తరమా ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Feb 16, 2026, 05:40:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలు ఎన్ని వచ్చినా బోర్ కొట్టదు. రెగ్యులర్ ఫార్మాట్‌లో ఉండి ఒకే స్టోరీని తిప్పి తిప్పి తెరకెక్కించిన డైలాగ్స్, సీన్స్, టేకింగ్‌తో మెప్పిస్తే చాలు ఆడియెన్స్ హృదయాల్లో నిలిచిపోతాయి. అందుకే ప్రేమ కథలు ఎవర్ గ్రీన్ జోనర్ అని చెప్పుకోవచ్చు.

ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ లవ్ డ్రామా- 9.1 రేటింగ్- 3 మనసుల మధ్య పోరాటం, హత్తుకునే డైలాగ్స్!
ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ లవ్ డ్రామా- 9.1 రేటింగ్- 3 మనసుల మధ్య పోరాటం, హత్తుకునే డైలాగ్స్!

డెబ్యూ డైరెక్టర్‌గా ఎంట్రీ

అలా గతేడాది థియేటర్లలో విడుదలైన రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమానే మరువ తరమా. హరీష్ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వా మెయిన్ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమాకు చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. అయితే, ఈ మరువ తరమా సినిమాతోనే చైతన్య వర్మ దర్శకుడిగా డెబ్యూ ఎంట్రీ ఇచ్చారు.

గతేడాది నవంబర్‌లో రిలీజ్

మరువ తరమా సినిమాను సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ పతాకంపై రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్, వి విజయ్ కుమార్ రాజు నిర్మాతలుగా మారి నిర్మించారు. గతేడాది నవంబర్ 28న థియేటర్లలో మరువ తరమా సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు.

మనసుకు హత్తుకునే డైలాగ్స్

కానీ, మరువ తరమా సినిమాలోని భావోద్వేగపు సీన్స్, మనసుకు హత్తుకునే డైలాగ్స్ మాత్రం బాగా మెప్పించాయన్న టాక్ వచ్చింది. నిజానికి మరువ తరమా సినిమా మూడు మనసుల మధ్య జరిగే పోరాటంగా అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. దానికి తగినట్లుగా సీన్స్, సంభాషణలను లోతుగా వ్యక్తపరుస్తూ తెరకెక్కించారు డైరెక్టర్ చైతన్య వర్మ.

అందమైన ప్రేమకథగా

అంతేకాకుండా మరువ తరమా సినిమాలోని బీజీఎమ్ మరింతగా అట్రాక్ట్ చేసిందని టాక్ వినిపించింది. విజువల్స్, అందమైన ప్రేమకథకు కావాల్సిన బ్యూటిపుల్ మ్యూజిక్ ఈ సినిమాకు సెట్ అయిందని కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా మరువ తరమా సినిమా హీరో అండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌ను మెప్పించింది.

9.1 రేటింగ్

మరువ తరమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రాహుల్ రవీంద్రన్ సినిమాను ప్రశంసించారు. ఇక థియేటర్లలో విడుదలైన మరువ తరమా సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 9.1 రేటింగ్ వచ్చింది. ఇంతటి మంచి రేటింగ్ సాధించిన మరువ తరమా ఓటీటీలోకి ఎట్టకేలకు వచ్చింది.

మరువ తరమా ఓటీటీ స్ట్రీమింగ్

వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులకు కానుకగా ఫిబ్రవరి 14 నుంచి మరువ తరమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో మొన్న మరువ తరమా ఓటీటీ రిలీజ్ అయింది. అంటే, థియేట్రికల్ రిలీజ్ తర్వాత సుమారు రెండున్నర నెలలకు మరువ తరమా ఓటీటీలోకి వచ్చేసిందన్నమాట.

ఈటీవీ విన్ ఓటీటీలో

హృదయానికి హత్తుకునే డైలాగ్స్, సీన్స్, ఫ్రెష్ మ్యూజిక్, బ్యూటిఫుల్ విజువల్స్‌తో మూడు మనసుల చుట్టూ సాగే ప్రేమకథగా తెరకెక్కిన మరువ తరమా సినిమాను థియేటర్లలో మిస్ అయినవారు ఈటీవీ విన్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More