ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ చెందిన స్వదేశ్ దర్శన్ 2.0 , ప్రసాద్ పథకాల కింద రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూపొందించిన రూ.419.30 కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ నిధులతో చేపట్టే మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అతిత్వరలోనే టెండర్లను పిలవనుంది.

గతంలోనే స్వదేశ్ దర్శన్ పథకం కింద రూ.152 కోట్ల వ్యయంతో అరకు బొర్రా గుహలు, సూర్యలంక బీచ్‌ల అభివృద్ధిని చేపట్టడంతో పాటు నాగార్జునసాగర్ వద్ద బుద్ధిస్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
కొత్తగా రూపుదిద్దుకోనున్న పర్యాటక కేంద్రాలివే
అరకు కల్చరల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్
అల్లురి సీతారామరాజు జిల్లా అరకులోయలోని కొత్తవలస ప్రాంతంలో ఐటీడీఏకి చెందిన 19.23 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, విశిష్టమైన అరకు కాఫీ ప్రాముఖ్యత, చిరుధాన్యాల వినియోగం మరియు స్థానిక గిరిజన వంటకాల రుచులను పర్యాటకులకు పరిచయం చేసేలా దీనిని తీర్చిదిద్దుతారు.
అరసవల్లి సన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్
శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణస్వామి క్షేత్ర పరిసరాలను ఆధ్యాత్మిక టూరిజం హబ్‌గా మార్చనున్నారు. నాగావళి నది తీరాన ఉన్న చారిత్రక డచ్ హెరిటేజ్ భవనానికి పూర్వవైభవం తీసుకురావడంతో పాటు, నాగావళి రివర్ ఫ్రంట్‌ను డిజిటల్ ఎగ్జిబిషన్లు, మ్యూజియం, చేతివృత్తుల హస్తకళల కేంద్రంగా ఆధునీకరిస్తారు.
గన్నవరం మైస్ సెంటర్
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం ఒక కిలోమీటరు దూరంలో, ఐదెకరాల విస్తీర్ణంలో భారీ మైస్ (Meetings, Incentives, Conferences, and Exhibitions) కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఏపీ పర్యాటక వైభవాన్ని చాటే ఇమ్మర్సివ్ థియేటర్, రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన తినుబండారాలు, స్థానిక స్వీట్లు, జ్ఞాపికల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాభివృద్ధి
నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రసాద్ పథకం కింద సమగ్రంగా అభివృద్ధి చేయనున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్ల నిర్వహణ, వేచి ఉండే హాళ్లు, కొత్త అన్నదాన భవనం, నూతన వంటశాల, గ్రేస్ ఫుల్ ఎంట్రెన్స్ ఆర్చ్, వాకింగ్ ట్రాక్స్, ల్యాండ్‌స్కేపింగ్, భక్తుల పార్క్, ఆధునిక భద్రతా ఏర్పాట్లు కల్పించనున్నారు.
భవిష్యత్ ప్రతిపాదనలు
{{/usCountry}}నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రసాద్ పథకం కింద సమగ్రంగా అభివృద్ధి చేయనున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్ల నిర్వహణ, వేచి ఉండే హాళ్లు, కొత్త అన్నదాన భవనం, నూతన వంటశాల, గ్రేస్ ఫుల్ ఎంట్రెన్స్ ఆర్చ్, వాకింగ్ ట్రాక్స్, ల్యాండ్‌స్కేపింగ్, భక్తుల పార్క్, ఆధునిక భద్రతా ఏర్పాట్లు కల్పించనున్నారు.
భవిష్యత్ ప్రతిపాదనలు
{{/usCountry}}ఇవే కాకుండా స్వదేశ్ దర్శన్ 2.0 తదుపరి విడత కోసం రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(APTDC) మరికొన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మచిలీపట్నంలో కోస్టల్ ఎక్స్‌పీరియన్స్ ప్రాజెక్టు, మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల అభివృద్ధి, మంగళగిరి ఎకో పార్క్ విస్తరణ, నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ బెలూం గుహల్లో ఆకర్షణీయమైన కేవ్ లైటింగ్, సందర్శకులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన వంటి ప్రతిపాదనలు ఈ జాబితాలో ఉన్నాయి.