ఏపీ పర్యాటక రంగానికి జోష్.. మారనున్న 4 టూరిస్ట్ ప్లేస్‌ల రూపురేఖలు!
AP Tourism : స్వదేశ్ దర్శన్ 2.0, ప్రసాద్ పథకాల కింద ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవనుంది.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ చెందిన స్వదేశ్ దర్శన్ 2.0 , ప్రసాద్ పథకాల కింద రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూపొందించిన రూ.419.30 కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ నిధులతో చేపట్టే మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అతిత్వరలోనే టెండర్లను పిలవనుంది.

గతంలోనే స్వదేశ్ దర్శన్ పథకం కింద రూ.152 కోట్ల వ్యయంతో అరకు బొర్రా గుహలు, సూర్యలంక బీచ్‌ల అభివృద్ధిని చేపట్టడంతో పాటు నాగార్జునసాగర్ వద్ద బుద్ధిస్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
కొత్తగా రూపుదిద్దుకోనున్న పర్యాటక కేంద్రాలివే
అరకు కల్చరల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్
అల్లురి సీతారామరాజు జిల్లా అరకులోయలోని కొత్తవలస ప్రాంతంలో ఐటీడీఏకి చెందిన 19.23 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, విశిష్టమైన అరకు కాఫీ ప్రాముఖ్యత, చిరుధాన్యాల వినియోగం మరియు స్థానిక గిరిజన వంటకాల రుచులను పర్యాటకులకు పరిచయం చేసేలా దీనిని తీర్చిదిద్దుతారు.
అరసవల్లి సన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్
శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణస్వామి క్షేత్ర పరిసరాలను ఆధ్యాత్మిక టూరిజం హబ్‌గా మార్చనున్నారు. నాగావళి నది తీరాన ఉన్న చారిత్రక డచ్ హెరిటేజ్ భవనానికి పూర్వవైభవం తీసుకురావడంతో పాటు, నాగావళి రివర్ ఫ్రంట్‌ను డిజిటల్ ఎగ్జిబిషన్లు, మ్యూజియం, చేతివృత్తుల హస్తకళల కేంద్రంగా ఆధునీకరిస్తారు.
గన్నవరం మైస్ సెంటర్
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం ఒక కిలోమీటరు దూరంలో, ఐదెకరాల విస్తీర్ణంలో భారీ మైస్ (Meetings, Incentives, Conferences, and Exhibitions) కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఏపీ పర్యాటక వైభవాన్ని చాటే ఇమ్మర్సివ్ థియేటర్, రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన తినుబండారాలు, స్థానిక స్వీట్లు, జ్ఞాపికల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాభివృద్ధి
నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రసాద్ పథకం కింద సమగ్రంగా అభివృద్ధి చేయనున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్ల నిర్వహణ, వేచి ఉండే హాళ్లు, కొత్త అన్నదాన భవనం, నూతన వంటశాల, గ్రేస్ ఫుల్ ఎంట్రెన్స్ ఆర్చ్, వాకింగ్ ట్రాక్స్, ల్యాండ్‌స్కేపింగ్, భక్తుల పార్క్, ఆధునిక భద్రతా ఏర్పాట్లు కల్పించనున్నారు.
భవిష్యత్ ప్రతిపాదనలు
ఇవే కాకుండా స్వదేశ్ దర్శన్ 2.0 తదుపరి విడత కోసం రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(APTDC) మరికొన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మచిలీపట్నంలో కోస్టల్ ఎక్స్‌పీరియన్స్ ప్రాజెక్టు, మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల అభివృద్ధి, మంగళగిరి ఎకో పార్క్ విస్తరణ, నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ బెలూం గుహల్లో ఆకర్షణీయమైన కేవ్ లైటింగ్, సందర్శకులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన వంటి ప్రతిపాదనలు ఈ జాబితాలో ఉన్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


