ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత అమానుష ఘటన వెలుగుచూసింది. నడిరోడ్డుపై ఒక మహిళను వివస్త్రను చేసి, విచక్షణారహితంగా దాడి చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాజం తలదించుకునేలా సాగిన ఈ అనాగరిక చర్యపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలి ఆక్రందనలు విన్నా చూస్తూ ఉండిపోయారు కొందరు వ్యక్తులు.

జులై 15వ తేదీన రాత్రి కృష్ణబాబుకాలనీకి చెందిన మహిళ తన ఇంటి ముందర కుళాయి నుంచి మోటారు ద్వారా నీళ్లు పట్టుకుంటుంది. ఈ క్రమంలో మోటార్ తొలగించాలని చెబుతూ.. 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి వెంకటరమణమూర్తి, అతడి కుటుంబ సభ్యులు ఆమెతో గొడవకు దిగారు. తీవ్రంగా దాడి చేశారు. బాధితురాలు వెళ్తుంటే.. వెంటపడి మరి కొట్టారు. వెంకటరమణమూర్తి సోదరి, ట్రాన్స్‌జెండర్ మాధవి కొట్టారు.
బాధితురాలి వెంటపడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రను చేశారు. బాధితురాలు వదిలేయాలని వేడుకున్నది. అయినా పట్టించుకోలేదు. స్థానికంగా ఉన్న మహిళలు కాసేపటి తర్వాత అడ్డుకుని.. బాధితురాలికి దుస్తులు ఇచ్చారు. ఈ నెల 16వ తేదీన బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మెుత్తం 9 మందిపై ఈ ఘటనలో కేసు నమోదు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
మహిళల గౌరవం, భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా సహించబోమని పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి స్పష్టం చేశారు. అంతేకాదు 21వ డివిజన్ కార్యదర్శి వెంకటరమణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
గుంటూరు నగరంలోని ఒక ప్రధాన కూడలి వద్ద ఈ దారుణ ఘటన చోటుచేసుకోవడంతో ఇప్పుడు సంచలనమైంది. నిందితులు సదరు మహిళను నడిరోడ్డుపైకి లాగి, బట్టలు ఊడదీసి దారుణంగా కొట్టాడాన్ని కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు.
ఈ ఘటన సోషల్ మీడియా ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. మహిళల రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడబోదని ఆమె స్పష్టం చేశారు. 'గుంటూరులో మహిళపై జరిగిన అమానుష దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతాం. నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన శిక్ష పడేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించాను.' అని హోంమంత్రి చెప్పారు.
{{/usCountry}}ఈ ఘటన సోషల్ మీడియా ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. మహిళల రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడబోదని ఆమె స్పష్టం చేశారు. 'గుంటూరులో మహిళపై జరిగిన అమానుష దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతాం. నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన శిక్ష పడేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించాను.' అని హోంమంత్రి చెప్పారు.
{{/usCountry}}