మార్కాపురంలో ప్రైవేట్ బస్సు ఘటనలో 14 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తిరుగుతున్న ప్రైవేట్ బస్సులపై రవాణాశాఖ ఫోకస్ పెట్టింది. ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది.
ప్రత్యేక తనిఖీలు….

సరైన పత్రాలు లేని మోటార్ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి. రోడ్డు, హైవేస్, అగ్ని మాపకశాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నుంచి ఈ తనిఖీలు జరుగుతున్నాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా టోల్ ప్లాజాలు, వివిధ చెక్‌పోస్టుల వద్ద బస్సులను చెక్ చేస్తున్నారు. చింతూరు పోలీస్ స్టేషన్, పలమనేరు, నరహరిపేట, జిలుగుమిల్లి, కత్తిపూడి, పుల్లూరు టోల్ ప్లాజా, సున్నిపెంట, చిలకల్లు టోల్ ప్లాజా, బడవ టోల్ ప్లాజా, సాగర్ టోల్ ప్లాజా, దాచేపల్లి టోల్ ప్లాజా, శ్రీ కాళహస్తి టోల్గేట్, సూళ్లూరుపేట టోల్గేట్, కొడికొండ, పురుషోత్తపురం, సాలూరు బైపాస్ మొత్తం 16 పాయింట్లలో తనిఖీలు జరిగాయన్నాయి.
పలు బస్సులపై కేసులు నమోదు…
గురువారం సాయంత్రం నుంచి కొనసాగుతున్న డ్రైవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1036 బస్సులను తనిఖీ చేపట్టారు. ఉల్లంఘనలు గుర్తించిన 236 బస్సులపై కేసులు నమోదు చేశారు. పలమనేరులో 2 బస్సులను సీజ్ చేసి… నగదు జరిమానాలు విధించమని మంత్రి తెలిపారు.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాల నివారణ కోసం కఠిన చర్యలు అమలు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక నుంచి విధిగా ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్తామన్నారు. ప్రయాణికుల భద్రత కోసం భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అసలేం జరిగింది…?
మార్కాపురం జిల్లా రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు - టిప్పల్ లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సులోని 14 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో అడుగడుగునా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
{{/usCountry}}మార్కాపురం జిల్లా రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు - టిప్పల్ లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సులోని 14 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో అడుగడుగునా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
{{/usCountry}}అంతేకాకుండా ప్రమాదానికి ముందే ట్రావెల్ బస్సులో కొన్ని మరమ్మత్తులు చేసినట్లు కూడా తెలిసింది. యర్రగొండపాలెం టోల్‌గేట్ దాటిన తరువాత బస్సుకు యాభై నిమిషాల పాటు మరమ్మతులు చేసి…. తిరిగి బయల్దేరినట్లు వెలుగులోకి వచ్చింది.
ఈ ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర రవాణాశాఖ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై నిఘా పెట్టింది. ప్రత్యేకంగా డ్రైవ్ లు చేపట్టి… ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోనుంది. బస్సుల ఫిట్నెస్, అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.