ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు ₹9,450 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు భారీ మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాల పరిధిలోని ప్రయాణికులకు, సరుకు రవాణా రంగానికి ఎంతో మేలు చేయనుంది.
నాలుగు కీలక రైల్వే లైన్లు ఇవే..

ఈ కొత్త ప్రాజెక్టుల ద్వారా రైల్వే నెట్‌వర్క్‌కు అదనంగా మరో 410 కిలోమీటర్ల మేర లైన్లు తోడవనున్నాయి. ఆమోదం పొందిన ప్రాజెక్టుల వివరాలు:
- ఖరగ్‌పూర్ - భద్రక్ (రాణితాల్) 4వ లైన్: 173 కిలోమీటర్లు
- గుమ్మిడిపూడి - గూడూరు 3వ, 4వ లైన్: 90 కిలోమీటర్లు (ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు అత్యంత కీలకం)
- భద్రక్ - హరిదాస్‌పూర్ 4వ లైన్: 75 కిలోమీటర్లు
- కటక్ - పారాదీప్ (బడబంధ) 3వ, 4వ లైన్: 72 కిలోమీటర్లు
60 లక్షల మంది ప్రజలకు నేరుగా ప్రయోజనం
ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే రైళ్ల రాకపోకల వేగం పెరగడమే కాకుండా, పట్టాలపై రద్దీ గణనీయంగా తగ్గుతుంది. 'పీఎం గతిశక్తి' జాతీయ మాస్టర్ ప్లాన్ ప్రాతిపదికన రూపొందించిన ఈ పథకాల ద్వారా దాదాపు 6,448 గ్రామాలకు, సుమారు 60 లక్షల మంది జనాభాకు నేరుగా మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఇది ప్రాంతీయంగా స్వయం సమృద్ధిని సాధించడమే కాక, కొత్త ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను విరివిగా సృష్టిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.
పర్యాటక రంగానికి బూస్ట్.. పర్యావరణానికి రక్షణ
ఈ కొత్త లైన్లు అందుబాటులోకి వస్తే నేలపట్టు పక్షుల కేంద్రం, పులికాట్ సరస్సు, భితర్కనిక నేషనల్ పార్క్, కుల్దిహా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, చండీపూర్ బీచ్, లలితగిరి బౌద్ధ క్షేత్రం, లార్డ్ వీరరాఘవ పెరుమాళ్ కోవెల, దబలేశ్వర్ ఆలయం వంటి ప్రసిద్ధ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
దీంతో పాటు బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంట్, ఉక్కు, ఆటోమొబైల్, ధాన్యాల రవాణా వేగవంతమై, ప్రతి ఏటా అదనంగా 76 మిలియన్ టన్నుల (MTPA) సరుకు రవాణా సాధ్యమవుతుంది. రైలు రవాణా పెరగడం వల్ల సుమారు 13 కోట్ల లీటర్ల చమురు దిగుమతులు తగ్గడమే కాకుండా, 65 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది 2.60 కోట్ల చెట్లను నాటడంతో సమానమని కేంద్రం తన ప్రకటనలో వివరించింది.
{{/usCountry}}దీంతో పాటు బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంట్, ఉక్కు, ఆటోమొబైల్, ధాన్యాల రవాణా వేగవంతమై, ప్రతి ఏటా అదనంగా 76 మిలియన్ టన్నుల (MTPA) సరుకు రవాణా సాధ్యమవుతుంది. రైలు రవాణా పెరగడం వల్ల సుమారు 13 కోట్ల లీటర్ల చమురు దిగుమతులు తగ్గడమే కాకుండా, 65 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది 2.60 కోట్ల చెట్లను నాటడంతో సమానమని కేంద్రం తన ప్రకటనలో వివరించింది.
{{/usCountry}}