...
...
Next Story

AP Municipal Election Results 2026 : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు - మెజార్టీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల హవా..!

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కుప్పం సీటును టీడీపై కైవసం చేసుకుంది.

Published on: Nov 3, 2026, 12:20:46 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోంది. ఉదయం కౌంటింగ్ ప్రారంభం కాగానే అధికారులు మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత వార్డులు, డివిజన్ల వారీగా సాధారణ ఓట్ల లెక్కింపును చేపట్టారు. ఓటింగ్ ప్రారంభమైన తొలి గంట నుంచే రాష్ట్రవ్యాప్తంగా అధికార ఎన్డీయే కూటమి (తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ) అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ విజయపథంలో దూసుకుపోతున్నారు.

కార్పొరేషన్లలో మెజార్టీ దిశగా కూటమి మేయర్ అభ్యర్థులు

ఏపీ మున్సిపల్ ఎన్నికలు - కూటమి హవా
ఏపీ మున్సిపల్ ఎన్నికలు - కూటమి హవా

రాష్ట్రంలోని కీలక నగర పాలక సంస్థల (కార్పొరేషన్లు) ఫలితాల్లో కూటమి మేయర్ అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విశాఖపట్నం కార్పొరేషన్‌లో కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి విజయం వైపు అడుగులు వేస్తున్నారు. గుంటూరులో కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, విజయనగరంలో అవనాపు భార్గవి, చిత్తూరులో కఠారి హేమలత, కర్నూలులో విజయ ప్రత్యూష తమ సమీప ప్రత్యర్థులపై స్పష్టమైన లీడ్‌ సాధించారు.

కేవలం కార్పొరేషన్లకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెజారిటీ మున్సిపాలిటీల్లోనూ ఎన్డీయే కూటమి జెండా ఎగురుతోంది. పలు నియోజకవర్గాల్లో ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కూటమి శ్రేణులు ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి.

మరోవైపు కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన పార్టీ అమలాపురం, మడకశిర, నరసాపురం, తిరువూరు, గొల్లప్రోలు, సామర్లకోట మున్సిపాలిటీలలో లీడ్‌లో ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ (భాజపా) గిద్దలూరు, ఎలమంచిలి మున్సిపాలిటీల్లో తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ విజయం దిశగా పయనిస్తోంది. కౌంటింగ్ కేంద్రాల వెలుపల కూటమి నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే సంబరాలు ప్రారంభించారు.

టీడీపీ ఖాతాలోకి కుప్పం…

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks