రాయలసీమ లిఫ్ట్‌పై చంద్రబాబు దుష్ప్రచారం, రేవంత్‌తో చీకటి ఒప్పందం : వైఎస్ జగన్
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు విధానాలు చూస్తుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందాలు చేసుకున్నట్టుగా ఉన్నాయని ఆరోపించారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేకంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను జగన్ ప్రస్తావించారు. రాయలసీమ లిఫ్ట్‌పై చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు.

సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయల కోసం రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టారని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా తాకట్టు పెట్టారో తెలంగాణ సీఎం రేవంత్ చెప్పారని, ఈ ప్రాజెక్టును ఆపించామని అసెంబ్లీలో మాట్లాడారని గుర్తు చేశారు. రాయలసీమ లిఫ్ట్ మీద వాస్తవాలు అందరికీ తెలియాలన్నారు.
'రేవంత్‌తో చంద్రబాబుకు రహస్య ఒప్పందం కుదిరింది. రాయలసీమ లిఫ్ట్ సీమ, నెల్లూరుకు సంజీవిని. చంద్రబాబు క్లోజ్‌డోర్ మీటింగ్‌లో అడిగినట్టుగా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పారు. చంద్రబాబు అండ్ కో బరితెగించి మాట్లాడటం చూస్తుంటే.. రేవంత్‌తో చీకటి ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టుగా ఉంది. స్వార్థం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచారు. స్వార్థం కోసం జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచారు.' అని వైఎస్ జగన్ విమర్శించారు.
పోతిరెడ్డిపాడుకు నీరు రావాలంటే.. శ్రీశైలంలో 881 అడుగుల నీటిమట్టం ఉండాలని వైఎస్ జగన్ చెప్పారు. పోతిరెడ్డిపాడుకు ఏడువేల క్యూసెక్కులు రావాలంటే.. 854 అడుగుల ఎత్తులో నీళ్లు తోడుకోవాలన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 101 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయన్నారు. 'పోతిరెడ్డిపాడు నుంచి రెండు, మూడు సార్లే నీటిని తీసుకున్నాం. కల్వకుర్తిని 25 నుంచి 50 టీఎంసీలకు పెంచారు. పాలమూరు-రంగారెడ్డి, డిండిని డిజైన్ చేశారు. ఎస్ఎల్‌బీసీ నుంచి మరో 40 టీఎంసీలు తోడుకోవడానికి నిర్మాణాలు, అదనంగా మరో టీఎంసీ కోసం కూడా తెలంగాణ ప్రణాళికలు చేసింది. 770 అడుగల నుంచే ఎడమవైపు పవర్ హౌస్ ద్వారా.. మరో 4 టీఎంసీలు తోడేస్తున్నారు. రోజుకు మెుత్తం తెలంగాణ 8 టీఎంసీలు తోడుకుంటుంది.' అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
చంద్రబాబు నోరు మెదపలేక రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని జగన్ విమర్శించారు. శ్రీశైలంలో 777 అడుగుల దగ్గరే తెలంగాణ నీళ్లు తోడుకుంటుంటే.. ఏపీ మాత్రం 834 అడుగుల దగ్గర నీరు తోడుకునే పరిస్థితి ఉందన్నారు. శ్రీశైలానికి ఎప్పుడూ 881 అడుగుల నీరు చేరుకుంటుందన్నారు. సీమ సస్యశ్యామలం కోసమే.. రాయలసీమ లిఫ్ట్ చేపట్టామన్నారు. 800 అడుగుల్లో రోజుకు 3 టీఎంసీలు తోడుకునేలా డిజైన్ చేశామని, వెయ్యి కోట్లు ఖర్చు చేసి పనులు పరుగులు పెట్టించామని చెప్పారు.
'రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్‌ను అడ్డుకునేందుకు చంద్రబాబే స్వయంగా కేసులు వేయించారు. మా ప్రభుత్వం రాకపోవడం సీమ ప్రజల దురదృష్టం. రాయలసీమకు చంద్రగ్రహణం పట్టింది. 22 టీఎంసీలకు లిఫ్ట్ ఎందుకని చంద్రబాబు అంటున్నారు. శ్రీశైలం నీటిని 500 కిలోమీటర్లు తీసుకెళ్లి కుప్పంకు ఇచ్చాం. ఆంధ్రా, తెలంగాణ ప్రజలు అన్నదమ్ములం. ఏపీ ప్రజలకు నష్టం జరగకుండా చూడాలి. తప్పును సరిదిద్దుకోకపోతే చరిత్రహీనులవుతాం.' అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


