దీని ఇజ్తిమాకు దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్.. ఈ తేదీల్లో తెలంగాణ టూ ఆంధ్రాకు!

కడప జిల్లాలోని కొప్పర్తిలో దీని ఇజ్తిమా(ముస్లింల మతపరమైన సమావేశం) జరగనుంది. ఈ కార్యక్రమం కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును ప్రకటించింది.

Updated on: Jan 7, 2026, 20:33:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జనవరి 23 నుండి కడప జిల్లాలోని కొప్పర్తిలో జరగనున్న ‘దీని ఇజ్తిమా’కు హాజరయ్యే వారి సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును నడపనుంది. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఈ ట్రైన్ గురించి మాట్లాడారు. సౌత్ సెంట్రల్ రైల్వే తెలంగాణలోని చర్లపల్లి నుండి తిరుపతి జిల్లాలోని తిరుచానూరు వరకు ఈ ప్రత్యేక రైలును నడుపుతుందని తెలిపారు. రైలు నెం. 07140 చర్లపల్లి-తిరుచానూరు రైలు జనవరి 22న చర్లపల్లిలో బయలుదేరుతుంది. నిజామాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు మీదుగా ప్రయాణించి ఉదయం 5.30 గంటలకు నంద్యాలకు చేరుకుంటుంది. నంద్యాల నుండి ఈ రైలు కడప మీదుగా తిరుచానూరుకు చేరుకుంటుంది.

ప్రత్యేక రైలు
ప్రత్యేక రైలు

తిరుగు ప్రయాణంలో రైలు నెం. 07141 జనవరి 25న రాత్రి 11.30 గంటలకు తిరుచానూరులో బయలుదేరుతుంది. తెల్లవారుజామున 3 గంటలకు కడపకు, ఉదయం 6.50 గంటలకు నంద్యాలకు చేరుకుని, చివరకు గుంటూరు, విజయవాడ, వరంగల్, నిజామాబాద్ మీదుగా చర్లపల్లికి చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైలు ఇజ్తిమాకు వెళ్లే నంద్యాల వాసులకు ప్రయోజనకరంగా ఉంటుందని శబరి అన్నారు. ప్రత్యేక రైలును నడుపుతున్నందుకు దక్షిణ మధ్య రైల్వేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

'కడపలో జరగబోయే ఆంధ్రా–తెలంగాణ రాష్ట్ర దీని ఇజ్తిమ(జనవరి 23 నుంచి 25 వరకు)కు వేలాది మంది హాజరుకానున్న నేపథ్యంలో.. నంద్యాల మీదుగా రెండు దిశలలో స్పెషల్ ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇజ్తిమకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం South Central Railway అధికారులు రైలు నంబర్ 07140 / 07141లను ప్రత్యేకంగా నడపడం అభినందనీయం. నంద్యాల నుంచి దీని ఇజ్తిమకు వెళ్లే వారు ఈ స్పెషల్ ట్రైన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నంద్యాల జిల్లా వాసులందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.' అని ఎంపీ శబరి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఈ ప్రత్యేక రైలు చర్లపల్లిలో మెుదలవుతుంది. మౌలాలి, బొలారం, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ, కృష్ణా, గుంటూరు జంక్షన్, నంద్యాల, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట, తిరుచానూరులో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో తిరుచానూరులో మెుదలై.. చర్లపల్లికి వెళ్తుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More