ఏపీ ఇంటర్ పరీక్షల ప్రశ్నల్లో మార్పులు.. క్రియేటివిటీ పెంచేలా క్వశ్చన్స్.. బట్టీకి బై-బై
AP Inter Exams : ఏపీలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థుల ప్రశ్నపత్రాల్లో కీలక మార్పులు రానున్నాయి. ఇందుకోసం ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. రాబోయే 2027-28 విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల రూపురేఖలను మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జాతీయ విద్యా విధానం (NEP-2020) లక్ష్యాలకు అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ పరఖ్ మార్గదర్శకాలకు లోబడి ఈ నూతన విధానాన్ని తీసుకురానున్నారు.

ఇప్పటివరకు అమలులో ఉన్న విధానంలో విద్యార్థులు పుస్తకాల్లోని సమాధానాలను కంఠస్థం చేసి బట్టీ పట్టి పరీక్షల్లో యథాతథంగా రాసేవారు. అయితే ఇకపై ఈ ధోరణికి స్వస్తి పలకనున్నారు. విద్యార్థుల్లోని ఆలోచనా శక్తి, సమస్యల పరిష్కార నైపుణ్యం, విశ్లేషణాత్మక పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలను రూపొందించనున్నారు.
విద్యార్థుల స్వతంత్ర ఆలోచనలు, సృజనాత్మకతను అంచనా వేసేందుకు ప్రశ్నపత్రాల్లో ప్రత్యేకంగా 10 శాతం మార్కులను కేటాయిస్తారు. అంటే ఒక ప్రశ్నలు ఇచ్చి.. దీనిని మీరైతే ఎలా చేస్తారు? సొంతంగా రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలకు పుస్తకాల్లోని విషయాలకు సంబంధం ఉండదు.
సాంప్రదాయ ప్రశ్నల స్థానంలో, విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించే కొత్త ప్రశ్నలను చేర్చనున్నారు. బోర్డు ఆమోదం అనంతరం రాబోయే విద్యాసంవత్సరం ముద్రించే పుస్తకాల్లో ఇవి అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే పలువురు సబ్జెక్ట్ నిపుణుల నుండి నూతన శైలి ప్రశ్నలను సేకరించారు.
దేశవ్యాప్తంగా పాఠశాల విద్య, పరీక్షల మూల్యాంకనం, విద్యార్థుల సామర్థ్యాల లెక్కింపులో ఏకరూపత తీసుకురావడానికి NCERT పరిధిలోని జాతీయ మూల్యాంకన కేంద్రం 'పరఖ్' విధానాన్ని రూపొందించింది. ఈ నిబంధనలపై అవగాహన పెంచేందుకు NCERT ఇప్పటికే ఇంటర్ బోర్డు అధికారులకు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించింది.
విద్యార్థులకు కేవలం సమాధానాలు చెప్పడమే కాకుండా, వారిలో విశ్లేషణాత్మక ఆలోచనను పెంపొందించేలా బోధనా పద్ధతుల్లో మార్పులు తెచ్చేందుకు అధ్యాపకులకు కూడా తగిన శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థులకు క్రియేటివిటీ పెరిగేలా తయారుచేస్తారు.
ఈ కొత్త పరీక్షా విధానం ద్వారా విద్యార్థుల్లో కేవలం మార్కుల వేట కాకుండా ముఖ్యమైన సామర్థ్యాలను అంచనా వేస్తారు. ఇందులో భాగంగా పాఠ్యాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, సొంత మాటల్లో సమాధానం రాయాలి. కొత్త రకం సమస్యలను విభిన్న కోణాల్లో విశ్లేషించి, వినూత్న పరిష్కారాలు కనుగొనాలి. ఒక లక్ష్యం కోసం ఇతరులతో కలిసి పనిచేయడం, బాధ్యతలను పంచుకోవడం, భిన్నమైన అభిప్రాయాలను గౌరవించే నైపుణ్యాన్ని పెంచుకోవాలి.
ఈ మార్పుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మరింత మెరుగైన ప్రతిభ చూపడానికి అవకాశం లభిస్తుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. వారిలో క్రియేటివిటీ పెరిగి భవిష్యత్తులో ఉన్నతస్థానాలకు వెళ్తారని అంటున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


