...
...
Next Story

తిరుమల పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమనకు నోటీసులు!

తిరుమల పరకామణి చోరీ కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

Published on: Nov 25, 2025, 12:45:41 IST
Advertisement

తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని తెలిపారు. దీంతో ఈ కేసుపై మరింత ఆసక్తి పెరిగింది.

భూమన కరుణాకర్ రెడ్డి(ఫైల్ ఫొటో)
భూమన కరుణాకర్ రెడ్డి(ఫైల్ ఫొటో)

శ్రీవారి పరకామణిలో 920 అమెరికన్ డాలర్లు చోరీ చేస్తూ.. సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ 2023లో దొరికారు. అప్పటి టీటీడీ విజిలెన్స్ ఎస్ఐ సతీశ్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అదే సంవత్సరం మే 30వ తేదీన రవికుమార్ మీద విజిలెన్స్ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల అనంతరం సీఐడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. డిసెంబర్ 2వ తేదీలోగా నివేదిక సమర్పించాల్సి ఉంది.

ఈ కేసులో మరో కీలక విషయం ఏంటంటే.. కేసు నుంచి తప్పిస్తే.. తన ఆస్తులు టీటీడీకి ఇస్తానని రవికుమార్ ప్రతిపాదించారు. అతడి ఆస్తులపై కొందరు నేతలు కన్నేశారని ఆరోపణలు వచ్చాయి. లోక్ అదాలత్‌లో కేసును వైసీపీ నాయకులు రాజీ చేయించి.. రవి కుమార్ ఆస్తులు కొన్ని టీటీడీకి విరాళంగా తీసుకుంటున్నట్టుగా తీర్మానించి.. పరాకమణి కేసును పక్కకు పెట్టారని వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. దీంతో పరకామణి వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసులో ఏం జరుగుతుందా అని ఆసక్తి నెలకొంది. తాజాగా టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సీఐడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాలని చెప్పింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe