మానవత్వానికే మచ్చ తెచ్చేలా, నమ్మిన స్నేహితులే ఒక వ్యక్తిని డబ్బు కోసం చంపేశారు. ఈ ఘోరమైన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానం, అంతర్రాష్ట్ర పోలీసుల సమన్వయంతో అనంతపురం జిల్లా డి.హిరేహాళ్ మండలం పులకుర్తి గ్రామంలో జరిగిన ఈ కిరాతక హత్య కేసును జిల్లా పోలీసులు ఛేదించారు.

జూన్ 23న పులకుర్తి సమీపంలోని వ్యవసాయ పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించింది. అసలు ఎలాంటి సాక్ష్యాలు కూడా ఈ కేసులో పోలీసులకు కనిపించలేదు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న అనంతపురం ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు రాయదుర్గం రూరల్ ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది.
ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఆధారాలు సేకరించేందుకు వెళ్లింది. కానీ అక్కడ దొరికింది మాత్రం కేవలం ఒక సగం కాలిన పాపడాల ప్యాకెట్. ఇదే ఈ కేసులో కీలక మలుపుగా మారింది. ఆ ప్యాకెట్ కోడ్ ఆధారంగా చెన్నైలోని తయారీదారుడిని పట్టుకున్నారు. అక్కడి నుండి బళ్లారిలోని పంపిణీ నెట్‌వర్క్‌ను పోలీసులు ట్రాక్ చేశారు. వాటిని ఎక్కడకెక్కడకు పంపేవారో ఆరా తీశారు. చివరకు ఆ బాధితుడు బళ్లారికి చెందిన గురూరాజ్ రావు అని గుర్తించారు. గురూరాజ్ మాటలు రాని, వినికిడి లోపం ఉన్న వ్యక్తి. అతడు పాపడాలు అమ్ముకుంటూ, గుడిలో పూజారిగా బతుకును సాగిస్తున్నాడు.
గురూరాజ్ కనిపించడం లేదని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత కూడా అతడి ఏటీఎం కార్డు ద్వారా వివిధ ప్రాంతాల్లో నగదు విత్‌డ్రా అయినట్లు కనిపెట్టారు. ఆయా ఏటీఎంల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా బళ్లారికి చెందిన బసవరాజు, కొట్రేష్ అనే ఇద్దరు వ్యక్తులు నిందితులుగా తేలారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఇద్దరు నిందితులు కూడా మూగ, చెవుడు వారే.
మృతుడి వద్ద వ్యాపారం చేసిన సొమ్ము ఉందనే ఆశతో నమ్మిన స్నేహితుడినే చంపేశారు. గురూరాజ్కు మద్యం తాగించి, కళ్లల్లో కారం కొట్టి, తాడుతో గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి నిప్పంటించారు. బుధవారం రోజున ఓబుళాపురం క్రాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సైన్ లాంగ్వేజ్ (సంజ్ఞల) నిపుణుల సహాయంతో విచారించారు. నిందితులు నేరాన్ని అంగీకరించారు.
{{/usCountry}}మృతుడి వద్ద వ్యాపారం చేసిన సొమ్ము ఉందనే ఆశతో నమ్మిన స్నేహితుడినే చంపేశారు. గురూరాజ్కు మద్యం తాగించి, కళ్లల్లో కారం కొట్టి, తాడుతో గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి నిప్పంటించారు. బుధవారం రోజున ఓబుళాపురం క్రాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సైన్ లాంగ్వేజ్ (సంజ్ఞల) నిపుణుల సహాయంతో విచారించారు. నిందితులు నేరాన్ని అంగీకరించారు.
{{/usCountry}}