సోషల్ మీడియాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ పెట్టాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. 90 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని వెల్లడించారు.
90 రోజుల్లో విధివిధానాలు - సీఎం చంద్రబాబు

ఐటీ శాఖ మంత్రి సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడి తనంపై ఓ సిఫార్సు కూడా చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. 13 ఏళ్ల వయసు లోపు వారికి సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమానికి 90 రోజుల్లో శ్రీకారం చుడతామన్నారు. టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని…. బానిసైతే జీవితాలు నాశనమవుతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది జనవరిలోనే ఈ విషయంపై ఐటీ మంత్రి లోకేశ్ పలు విషయాలను ప్రస్తావించారు. ఏపీలో కూడా ఆస్ట్రేలియా మాదిరి చట్టం తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం కూడా సబ్ కమిటీ ఏర్పాటు చేసి… పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ఈ విషయంపై ప్రకటన చేశారు.
ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లల కోసం టిక్ టాక్, ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్ చాట్ మరియు థ్రెడ్స్ ను నిషేధించింది. గతేడాది డిసెంబర్ 10 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సదరు కంపెనీలు కూడా ఆ దిశగా చర్యలు చేపట్టాయి. కొన్ని ఫ్లాట్ ఫామ్స్ కు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయించారు.
ఇక ఏపీలో కూడా విధి విధానాలు ఖరారైన తర్వాత… ఆయా సోషల్ మీడియా సంస్థలు కూడా ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకురాబోయే విధివిధానాలు ఎలా ఉంటాయనేది త్వరలోనే తెలిసిపోనుంది.
{{/usCountry}}ఇక ఏపీలో కూడా విధి విధానాలు ఖరారైన తర్వాత… ఆయా సోషల్ మీడియా సంస్థలు కూడా ప్రభుత్వ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకురాబోయే విధివిధానాలు ఎలా ఉంటాయనేది త్వరలోనే తెలిసిపోనుంది.
{{/usCountry}}