AP Govt Employees PRC DAs : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. డీఏలతో పాటు పీఆర్సీపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములని…. వారికి తమ ప్రభుత్వం సాధ్యమైనంత వరకు అన్ని విధాలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

{{^htLoading}} {{/htLoading}}
ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై ముఖ్యమంత్రి అమరావతిలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో ఉద్యోగుల సంక్షేమం, బకాయిల చెల్లింపులకు సంబంధించి సీఎం చంద్రబాబు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
సీఎం చంద్రబాబు ముఖ్య నిర్ణయాలు :
- ఉద్యోగులు సుదీర్ఘకాలంగా కోరుతున్న వేతన సవరణ కోసం 12వ పీఆర్సీ (12th Pay Revision Commission) నియామకానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
- ఉద్యోగులకు అందాల్సిన బకాయిల్లో 1-7-2024 మరియు 1-1-2025 కి సంబంధించిన రెండు కరవు భత్యాలను (డీఏలు) 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
- 2022 సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ సరెండర్ లీవుల నిధులను వచ్చే సంక్రాంతి పండుగ కానుకగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయడానికి సీఎం ఆమోదం తెలిపారు.
- శాంతిభద్రతల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసు శాఖ ఉద్యోగులకు వచ్చే దసరా పండుగ సందర్భంగా ఒక అదనపు సరెండర్ లీవ్ డబ్బులను చెల్లించాలని నిర్ణయించారు.
- విశ్రాంత ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను జనవరి 2027 నుంచి అమలు చేయనున్నారు. దీని ద్వారా 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం మేర అదనపు పెన్షన్ లబ్ధి చేకూరనుంది.
- ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి హెల్త్ స్కీమ్‌ను సంపూర్ణంగా స్ట్రీమ్‌లైన్ చేయనున్నారు. వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు నిర్ణీత నిధులను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
- ఈ కీలక నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా దాదాపు రూ. 2,880 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికే తమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}