AP Govt Employees PRC DAs : ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త - పీఆర్సీతో పాటు 2 డీఏలపై సీఎం కీలక ప్రకటన

AP Govt Employees PRC DAs : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. 12వ PRC నియామకానికి అంగీకారం తెలిపారు. రెండు డీఎలు 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Published on: Sep 5, 2026, 17:11:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Govt Employees PRC DAs : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. డీఏలతో పాటు పీఆర్సీపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములని…. వారికి తమ ప్రభుత్వం సాధ్యమైనంత వరకు అన్ని విధాలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం
ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం

ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై ముఖ్యమంత్రి అమరావతిలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో ఉద్యోగుల సంక్షేమం, బకాయిల చెల్లింపులకు సంబంధించి సీఎం చంద్రబాబు పలు నిర్ణయాలు తీసుకున్నారు.

సీఎం చంద్రబాబు ముఖ్య నిర్ణయాలు :

  • ఉద్యోగులు సుదీర్ఘకాలంగా కోరుతున్న వేతన సవరణ కోసం 12వ పీఆర్సీ (12th Pay Revision Commission) నియామకానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
  • ఉద్యోగులకు అందాల్సిన బకాయిల్లో 1-7-2024 మరియు 1-1-2025 కి సంబంధించిన రెండు కరవు భత్యాలను (డీఏలు) 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
  • 2022 సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ సరెండర్ లీవుల నిధులను వచ్చే సంక్రాంతి పండుగ కానుకగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయడానికి సీఎం ఆమోదం తెలిపారు.
  • శాంతిభద్రతల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసు శాఖ ఉద్యోగులకు వచ్చే దసరా పండుగ సందర్భంగా ఒక అదనపు సరెండర్ లీవ్ డబ్బులను చెల్లించాలని నిర్ణయించారు.
  • విశ్రాంత ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను జనవరి 2027 నుంచి అమలు చేయనున్నారు. దీని ద్వారా 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం మేర అదనపు పెన్షన్ లబ్ధి చేకూరనుంది.
  • ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి హెల్త్ స్కీమ్‌ను సంపూర్ణంగా స్ట్రీమ్‌లైన్ చేయనున్నారు. వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు నిర్ణీత నిధులను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
  • ఈ కీలక నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా దాదాపు రూ. 2,880 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికే తమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More