AP Collectors Conference : ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లోనూ గ్రీవియన్స్ డే - సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో 'ఫీల్డ్ గ్రీవియన్స్ డే' నిర్వహించాలని… సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు.

Published on: May 8, 2026, 13:17:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా పరిపాలనపై దిశానిర్దేశం చేశారు. పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రస్సల్ సిస్టమ్ (PGRS) ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడంలో జాప్యం జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఫిర్యాదులు స్వీకరించడమే కాకుండా…. వాటికి శాశ్వత పరిష్కారం చూపినప్పుడే ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని, ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని సీఎం పేర్కొన్నారు.

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు

ప్రతి శుక్రవారం 'ఫీల్డ్ గ్రీవియన్స్ డే'

ప్రస్తుతం ప్రతి సోమవారం కలెక్టరేట్లలో నిర్వహిస్తున్న గ్రీవియన్స్ డే తరహాలోనే, ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో గ్రీవియన్స్ డే నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిని 'ఫీల్డ్ గ్రీవియన్స్ డే'గా పిలవాలని, నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని అధికారులకు సూచించారు.

సీఎం చంద్రబాబు ప్రస్తావించిన అంశాలు :

  • " పీజీఆర్ఎస్ విధానంలో కేవలం అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలి. ఇద్దరూ కలిసి కూర్చుని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేయాలి.
  • సింగపూర్‌లో ఫిర్యాదుల పరిష్కారం ఏ విధంగా జరుగుతుందో, అదే తరహాలో ఇక్కడ కూడా పకడ్బందీ వ్యవస్థను తీసుకురావాలి. ఇందుకోసం 'ప్రజా దర్బార్' లాంటి వేదికను ఏర్పాటు చేయబోతున్నాం.
  • అధికారులు ప్రతి నెలా ఒక నియోజకవర్గాన్ని కనీసం నాలుగు సార్లు సందర్శించాలి. సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు ఒక 'గుడ్ విల్ మిషన్' లాగా క్షేత్రస్థాయికి వెళ్లాలి.
  • ప్రజల నుంచి తీసుకున్న పిటిషన్లను కేవలం కాగితాలకే పరిమితం చేసి కార్లలో వదిలేయవద్దు. ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలి.
  • వీడియో కాన్ఫరెన్స్‌ల వల్ల అధికారుల సమయం వృథా కాకుండా ఉండేందుకు, వారంలో కేవలం ఒక రోజును మాత్రమే వీడియో కాన్ఫరెన్స్‌ల కోసం కేటాయించాలి.
  • మండల స్థాయిలోనూ గ్రీవియన్స్ విధానాన్ని బలోపేతం చేయడం ద్వారా సామాన్యులకు ప్రభుత్వం మరింత చేరువవుతుంది. ప్రజల నమ్మకాన్ని కాపాడటమే ఈ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం" అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

ప్రభుత్వ నిబంధనలు, ప్రొసీజర్స్ సులభతరం కావాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. “కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంత టైమ్ వృధా అవుతుందో ఆలోచించండి. ప్రజలకు త్వరితగతిన సేవలు అందిస్తూ.. ఆన్ లైన్ సేవలను పూర్తిగా అందుబాటులోకి తెస్తే ప్రజల సమయం వృధా కాదు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితే... పాలన సులభతరం అవుతుంది. వాట్సాప్ గవర్నెన్సు మనమిత్ర ద్వారా పౌరసేవలపై ప్రజలకు శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే 29 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాం... 90 శాతం ప్రభుత్వ సేవలు వాట్సప్ లో అందుబాటులో ఉన్నాయి. డిసెంబరు నాటికి అన్ని సేవల్ని వాట్సప్ లో అందించేలా చూడాలి. మాన్యువల్ టచ్ పాయింట్ల వద్దకు వచ్చే ప్రజలకు వాట్సప్ వినియోగాన్ని వివరించాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More