...
...
Next Story

LPG Cylinders : మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సిద్ధం - సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సరఫరా పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎస్ తో పాటు పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్ (GAIL), ఓఎన్‌జీసీ (ONGC) అధికారులు హాజరయ్యారు.

Published on: Mar 17, 2026, 18:10:51 IST
Advertisement

ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సమీక్షలో పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులు పాల్గొనగా… వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సీఎం చంద్రబాబు సమీక్ష
సీఎం చంద్రబాబు సమీక్ష

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రకటిచించారు. మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రాబోతోందని తెలిపారు. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.

కొరత లేకుండా చూడండి - సీఎం ఆదేశాలు

ఆస్పత్రులకు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజలకు తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలన్నారు. మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా, ప్రజలు ప్యానిక్ కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ స్టాక్స్ లభ్యత పెరిగేలా చూడాలని… గ్యాస్ కంపెనీలు స్వల్పకాలికంగా ఉత్పత్తి పెంపు, మెరుగైన పంపిణీ జరిగేలా చూడాలని పేర్కొన్నారు.

“రాష్ట్రంలో మరింతగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరించే అంశంపై దృష్టి సారించాలి. ఏపీలోని కేజీ బేసిన్ లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేసేలా చూడాలి. సీఎన్జీ, పీఎన్జీల వినియోగాన్ని గరిష్టంగా పెంచేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe