Gas Cylinder Check : ఇంట్లోని సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో ఎలా తెలుసుకోవాలి? సింపుల్ టిప్స్

Gas Cylinder Check : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇంట్లోని ఎల్పీజీ సిలిండర్‌‌లో ఎంత గ్యాస్ ఉందో చెక్ చేసేందుకు సింపుల్ టిప్స్ తెలుసుకోండి.

Published on: Mar 16, 2026, 12:01:43 IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇప్పుడు దేశం మెుత్తం ఎల్పీజీ గురించే చర్చ. ఇప్పటికే కమర్షియల్ ఎల్పీజీ సరఫరా ఆగిపోయింది. చాలా ప్రాంతాల్లో కృత్రిమ కొరత సృష్టించి.. డొమెస్టిక్ సిలిండర్ల మీద ఎక్కువగా డబ్బులు దండుకుంటున్నారు. ఇంట్లోని ఎల్పీజీ సిలిండర్‌లో ఇప్పుడు ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే కొన్ని రోజులుగా భారతదేశంలో LPG సిలిండర్ కొరత ఒక ప్రధాన సమస్యగా మారింది. పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో గ్యాస్ మీద ప్రభావం పడింది.

గ్యాస్ చెకింగ్ టిప్స్
గ్యాస్ చెకింగ్ టిప్స్

ప్రస్తుతం మీరు బుక్ చేసుకుంటే గృహ వినియోగ సిలిండర్ రావడానికి చాలా టైమ్ పడుతుంది. నిజానికి చాలా ప్రాంతాల్లో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ అవ్వడం లేదు. ఈ సమయంలో వంట చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా గ్యాస్ అయిపోతే కష్టమే. మీ గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో మీరు ముందే తెలుసుకోవాలి. ఇందుకో కొన్ని చిట్కాలు ఉన్నాయి.

  • గ్యాస్ సిలిండర్ చుట్టూ తడిగా ఉన్న గుడ్డను చుట్టి , ఒక నిమిషం పాటు అలాగే ఉంచండి. తర్వాత ఆ గుడ్డను తీసివేసి, కాసేపు సిలిండర్‌ను బాగా గమనించండి. పొడి ప్రాంతం సిలిండర్ లోపల ఖాళీ స్థలాన్ని సూచిస్తుంది, తడి ప్రాంతం గ్యాస్ ఉన్న ప్రాంతాన్ని చూపిస్తుంది. గ్యాస్ లేని ప్రాంతం వెంటనే ఎండిపోతుంది. గ్యాస్ ఉన్న ప్రాంతం ఆరిపోవడానికి కాస్త టైమ్ తీసుకుంటుంది. సిలిండర్‌లో మిగిలి ఉన్న గ్యాస్ మొత్తాన్ని నిర్ణయించడానికి ఇది కచ్చితమైన పద్ధతి.
  • గ్యాస్ సిలిండర్‌లో మిగిలి ఉన్న గ్యాస్ మొత్తాన్ని తనిఖీ చేయడానికి స్పర్శ విధానం కూడా ఉంది. సిలిండర్ ఒక వైపున కొంత వెచ్చని నీటిని పోయాలి. తరువాత నెమ్మదిగా మీ వేలిని నీరు పోసిన ప్రాంతంపైకి కదిలించండి. మీ వేలుకు చల్లదనం ఫీల్ అనిపిస్తే.. ఆ భాగం వరకు గ్యాస్ ఉన్నట్టు లెక్క. ఈ స్పర్శ పద్ధతితో సిలిండర్‌లో మిగిలి ఉన్న మొత్తాన్ని సులభంగా అంచనా వేయవచ్చు.
  • గ్యాస్ సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోవడానికి చాక్ పీస్‌తో కూడా ఒక సులభమైన చిట్కా పాటించొచ్చు. సిలిండర్ పైన నుండి కిందకు చాక్ పీస్‌తో ఒక నిలువు గీత గీయాలి. కొద్ది నిమిషాల తర్వాత గ్యాస్ ఉన్న భాగం చల్లగా ఉండటం వల్ల అక్కడ తేమ ఏర్పడి, చాక్ పీస్ గీత కొంచెం తడిగా కనిపిస్తుంది. గ్యాస్ లేని ఖాళీ భాగంలో గీత పొడిగా ఉంటుంది.
  • ఇక సాధారణంగా పద్ధతి ఏంటంటే.. గ్యాస్ రంగు ఆధారంగా అంచనా వేయడం. మంట రంగు నీలం రంగులో ఉంటే, తగినంత గ్యాస్ ఉందని అర్థం. దీనికి విరుద్ధంగా మంట రంగు పసుపు లేదా నారింజ రంగులో కనిపిస్తే.. గ్యాస్ అయిపోతోందని సూచిస్తుంది. బర్నర్‌లో గ్యాస్ పీడనం తగ్గి, వాయువులో కలిసిన మలినాలు మండడం ప్రారంభించడం వల్ల ఈ రంగు మార్పు జరుగుతుంది.
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More