LPG Gas Cylinder : గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లో ఇబ్బందులా? ఫోన్లోనే చిటికెలో పని పూర్తి! బుకింగ్ నంబర్లు..
How to book Indane gas online : ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ని ఎలా బుక్ చేసుకోవాలి? ఆన్‌లో ఎలా చేయాలి? మిస్డ్ కాల్ ఇస్తే గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుందా? వివిధ కంపెనీలకు చెందిన బుకింగ్ ప్రక్రియలను ఇక్కడ తెలుసుకోండి..
దేశంలోని ప్రధాన నగరాల్లో ఎల్‌పీజీ రీఫిల్ కోసం ప్రస్తుతం భారీ క్యూలు కనిపిస్తున్నాయి. సరఫరాలో ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, సిలిండర్ బుకింగ్ కోసం గంటల తరబడి ఏజెన్సీల ముందు వేచి ఉండాల్సిన అవసరం లేదు! ప్రముఖ గ్యాస్ పంపిణీ సంస్థలు వాట్సాప్, మిస్డ్ కాల్, మొబైల్ యాప్స్, ఐవీఆర్ఎస్ వంటి వివధ మార్గాలను అందుబాటులోకి తెచ్చాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లను ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..

ఇండేన్ (Indane) గ్యాస్ సిలిండర్ బుకింగ్..
ఇండేన్ తన వెబ్‌సైట్ ద్వారా వాట్సాప్, ఎస్ఎంఎస్/ఐవీఆర్ఎస్, మిస్డ్ కాల్, మొబైల్ అప్లికేషన్ వంటి సేవలను అందిస్తోంది.
వాట్సాప్ బుకింగ్: ముందుగా ఇండేన్ అధికారిక వాట్సాప్ నంబర్ 7588888824ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి. ఆపై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి “REFILL” అని టైప్ చేసి మెసేజ్ పంపండి. సిస్టమ్ మీ వివరాలను ధృవీకరించిన తర్వాత బుకింగ్ పూర్తవుతుంది.
మిస్డ్ కాల్: రీఫిల్ బుకింగ్ కోసం మిస్డ్ కాల్ సర్వీస్‌ను కూడా ఉపయోగించవచ్చు.
మొబైల్ యాప్: ఇండేన్ మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు.
అత్యవసర సేవలు: భద్రతకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఎల్‌పీజీ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 1906కు కాల్ చేయవచ్చు. వీటితో పాటు ఆన్‌లైన్ పేమెంట్స్ కోసం 'సహజ్' (Sahaj) ప్లాట్‌ఫారమ్ అందుబాటులో ఉంది.
LPG cylinder : 'గ్యాస్ సిలిండర్' వెనుక అసలు కథ- మిస్టరీగా మొదలై.. ప్రపంచాన్ని మార్చేసిన అద్భుతం!
హెచ్‌పీ గ్యాస్ (HP Gas) సిలిండర్ బుకింగ్..
హెచ్‌పీ గ్యాస్ కస్టమర్ల కోసం ఐవీఆర్ఎస్, మిస్డ్ కాల్, వాట్సాప్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
ఐవీఆర్ఎస్ నంబర్: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 88888 23456కు కాల్ చేసి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
మిస్డ్ కాల్: కేవలం 94936 02222 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి బుకింగ్ పూర్తి చేయవచ్చు.
వాట్సాప్: 92222 01122 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపడం ద్వారా బుకింగ్ ప్రక్రియను ప్రారంభించవచ్చు.
డిజిటల్ పేమెంట్స్: హెచ్‌పీ పే మొబైల్ యాప్, ఉమంగ్ యాప్ లేదా myhpgas.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అమెజాన్, పేటీఎం, ఫోన్‌పే వంటి యాప్స్ ద్వారా కూడా పేమెంట్ చేసే సదుపాయం ఉంది.
భారత్ గ్యాస్ (Bharat Gas) సిలిండర్ బుకింగ్..
భారత్ గ్యాస్ వినియోగదారులు ఆండ్రాయిడ్, ఐఫోన్లలో లభించే 'Bharatgas' మొబైల్ అప్లికేషన్ ద్వారా సేవలు పొందవచ్చు.
యాప్ ఇన్‌స్టాలేషన్: గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి 'Bharatgas' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
యాక్టివేషన్: యాప్ ఇన్‌స్టాల్ అయ్యాక, కొత్త కనెక్షన్ లేదా డిస్ట్రిబ్యూటర్ వివరాల కోసం లాగిన్ అవ్వకుండానే చూడవచ్చు. కానీ పాత కస్టమర్లు యాప్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.
విధానం: యాప్‌లో 'Activate' ఆప్షన్ ఎంచుకుని, మీ ఎల్‌పీజీ కన్స్యూమర్ ఐడీకి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌ని నమోదు చేయాలి. ఆ నంబర్‌కు వచ్చే ఎస్ఎంఎస్ కోడ్‌ను యాప్‌లో ఎంటర్ చేస్తే యాక్టివేషన్ పూర్తవుతుంది.
ఒకసారి యాక్టివేట్ అయితే, దీని ద్వారా సిలిండర్ బుకింగ్, పేమెంట్స్, రీఫిల్ హిస్టరీ చెక్ చేయడం, ఫిర్యాదులను నమోదు చేయడం వంటివి సులభంగా చేయవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. ఇరాన్ యుద్ధం వల్ల భారతదేశంలో ఎల్‌పీజీ సరఫరా ఎందుకు దెబ్బతింది?
భారతదేశం తన ఎల్‌పీజీ అవసరాలలో దాదాపు 60% దిగుమతుల ద్వారానే పొందుతోంది. ఇందులో ఎక్కువ భాగం ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ వంటి దేశాల నుంచి వస్తుంది.
హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేత: ఈ దేశాల నుంచి వచ్చే గ్యాస్ ట్యాంకర్లు ఇరాన్ తీరంలో ఉండే 'హోర్ముజ్ జలసంధి' గుండా ప్రయాణించాలి. యుద్ధం కారణంగా ఈ మార్గం మూతపడటంతో దాదాపు 90% ఎల్‌పీజీ దిగుమతులు నిలిచిపోయాయి.
ఫోర్స్ మెజూర్ : యుద్ధం కారణంగా సరఫరా చేయలేమని అంతర్జాతీయ గ్యాస్ కంపెనీలు 'ఫోర్స్ మెజూర్' ప్రకటించాయి, దీనివల్ల భారత్‌కు రావాల్సిన ట్యాంకర్లు ఆలస్యమవుతున్నాయి.
2. కొరతను అధిగమించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి
సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం 'ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్' కింద కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది:
దేశీయ ఉత్పత్తి పెంపు: రిఫైనరీలన్నింటికీ గ్యాస్ ఉత్పత్తిని గరిష్టంగా పెంచాలని ఆదేశించింది. దీనివల్ల గత కొద్ది రోజుల్లో దేశీయ గ్యాస్ ఉత్పత్తి 28% పెరిగింది.
వాణిజ్య సిలిండర్లపై నియంత్రణ: హోటళ్లు, రెస్టారెంట్లకు ఇచ్చే కమర్షియల్ సిలిండర్లపై కోత విధించి, ఆ గ్యాస్‌ను గృహ అవసరాలకు మళ్లిస్తున్నారు.
బుకింగ్ నిబంధనలు: హోర్డింగ్ (నిల్వ చేయడం) అరికట్టడానికి రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య కనీసం 25 రోజుల గ్యాప్ ఉండాలని నిబంధన విధించింది. అలాగే ఇండక్షన్ స్టవ్‌ల వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


