Gas Cylinder : ఎల్పీజీ సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్‌ ఇదే.. మరోవైపు పెళ్లిళ్లపై గ్యాస్ సిలిండర్ ఎఫెక్ట్!

Gas Cylinder Shortage : దేశంలో గ్యాస్ సంక్షోభంపై ఆందోళన నెలకొన్నది. ఎల్పీజీకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే.. టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని పౌర సరఫరాల శాఖ తెలిపింది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో క్యాటరింగ్ చేసేవారికి గ్యాస్ తిప్పలు తప్పడం లేదు.

Published on: Mar 12, 2026, 17:35:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ఎల్‌పీజీ సిలిండర్లు, అక్రమ వాణిజ్య వినియోగం లేదా పౌర సరఫరాలకు సంబంధించిన ఇతర అంశాలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1967కు డయల్ చేయాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రజలను కోరింది. గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ల అక్రమ మళ్లింపులపై చేసిన దాడుల సందర్భంగా, వరంగల్, హనుమకొండ, కర్మన్‌ఘాట్‌లలో 22 గృహ వినియోగ సిలిండర్లు, 25 చిన్న సిలిండర్లు, పలు గ్యాస్ రీఫిల్లింగ్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

గ్యాస్ సంక్షోభం
గ్యాస్ సంక్షోభం

పెళ్లిళ్లపై గ్యాస్ ఎఫెక్ట్

పెళ్లిళ్ల సీజన్ మెుదలైంది. చాలా వివాహాలు జరుగుతున్నాయి. అయితే దాదాపు అందరూ క్యాటరింగ్‌కు ఇస్తుంటారు. వెడ్డింగ్ సీజన్‌లో అనేక క్యాటరింగ్ సంస్థలు ఎల్పీజీ కొరత వల్ల కలిగే పరిస్థితిని ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తున్నాయి. పెళ్లి రోజు, తదుపరి రిసెప్షన్ రెండూ సాధారణంగా విలాసవంతమైన, రుచికరమైన విందుతో ఉంటాయి. క్యాటరర్లు తమకు ఆర్డర్‌లు ఇచ్చినవారి కోసం వంట గ్యాస్‌కు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

మెనూలో ఐటమ్‌లను తగ్గించడం గురించి కూడా ఆలోచిస్తున్నామంటున్నారు. కానీ ఇలా చేస్తే.. టోటల్ బడ్జెట్ మీద ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సూప్‌లు, స్వీట్లు, ఊరగాయలు, వెజ్ కర్రీలు, నాన్-వెజ్ కర్రీలు, రైస్, పులావ్, బిర్యానీలతో సహా కనీసం 16 నుండి 20 ఐటమ్‌లను అందిస్తారు. వంట గ్యాస్ కొరత కారణంగా కనీసం 8 నుండి 10 ఐటమ్‌లను తగ్గించాల్సి రావొచ్చేమోనని చెబుతున్నారు.

ఈ సంక్షోభం కొనసాగితే రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్లు దొరకడం కష్టం అవుతుందని పలు క్యాలటరింగ్ సంస్థలు చెబుతున్నాయి. మెనూ ఐటెమ్‌లను తగ్గించడం, ఈవెంట్‌ల సంఖ్యను పరిమితం చేయడం తప్ప వేరే మార్గం లేదని అంటున్నారు. ఈ గ్యాస్ సంక్షోభం క్యాటరింగ్ వ్యాపారాలను, ఫంక్షన్ల కోసం క్యాటరర్లపై ఆధారపడిన కస్టమర్లను ప్రభావితం చేస్తోంది. వంట గ్యాస్ కొరత తమకు ఆందోళన కలిగిస్తుందని, పెద్ద ఆర్డర్‌లను నిర్వహించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తోందని ఆవేదన చెందుతున్నారు క్యాటరింగ్ చేసేవారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More