...
...
Next Story

కోనసీమ గ్యాస్ లీక్‌పై సీఎం రివ్యూ.. పునరావాస కేంద్రాలకు 500 కుటుంబాలు, పరిహారం!

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇరుసుమండలో జరిగిన గ్యాస్ బ్లోఅవుట్ దగ్గర మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఓఎన్‌జీసీ నిపుణులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Published on: Jan 6, 2026, 17:18:56 IST
Advertisement

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇరుసుమండలో జరిగిన గ్యాస్ బ్లోఅవుట్ వద్ద మంటలను ఓఎన్‌జీసీ నిపుణులు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ అధికారులు ఈ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిపై తాజా సమాచారాన్ని అందించారు. గ్యాస్ లీక్‌ను నిర్వహించడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి వివిధ విభాగాలు అమలు చేస్తున్న చర్యలను హోంమంత్రి అనిత, ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఇతర అధికారులు వివరించారు.

ఓఎన్‌జీసీ బ్లోఅవుట్
ఓఎన్‌జీసీ బ్లోఅవుట్

ఇటువంటి సంఘటనలు జనాల్లో భయాందోళనలకు కారణమవుతాయని, స్థానిక ప్రజలకు వాస్తవాలను క్రమం తప్పకుండా తెలియజేయడం, వారికి భరోసా, మద్దతు అందించడం చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. పరిస్థితి పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు స్థానికులకు సహాయం చేయడం జిల్లా యంత్రాంగం బాధ్యత అని నొక్కి చెప్పారు. అగ్నిప్రమాదంలో కొబ్బరి చెట్లు దెబ్బతిన్న వారికి పరిహారం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

'మంటలను అరికట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవసరమైన ఏజెన్సీల సాయం తీసుకోవాలి. అక్కడ సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరంగా పూర్తి సహకారం అందించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఓఎన్జీసీతోపాటుగా ఇతర భాగస్వామ్య సంస్థలతో సమావేశం నిర్వహించాలి.' అని చంద్రబాబు ఆదేశించారు.

ఓఎన్జీసీ సాంకేతిక నిపుణులు ఢిల్లీ, ముంబై నుంచి వచ్చారు. నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయిలో మంటలు అదుపులోకి వచ్చేందుకు ఇంకా టైమ్ పట్టే అవకాశం ఉంది. 500 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించినట్టుగా వెల్లడించారు అమలాపురం ఎంపీ హరీశ్ మాధుర్. బాధితులకు అన్ని సౌకర్యాలు అందిస్తున్నట్టుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుక్షణం పరిస్థితిని సమీక్షిస్తున్నట్టుగా తెలిపారు.

ఈ మంటల వేడి కారణంగా కొబ్బరి చెట్లు కాలిపోయాయి. పంట పొలాలు, ఆక్వా సాగుకు కూడా పెద్ద నష్టం జరుగుతుందని అంచనా. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పరిహారం అందజేయాలని ఆదేశించారు. అగ్నికీలల్లో డ్రిల్లింగ్ రిగ్, లాగింగ్ టూల్స్, భారీ వాహనాలు కాలిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఓఎన్‌జీసీ రాజమండ్రి అసెట్ ఉత్పత్తి మెరుగుదల కార్యకలాపాల కోసం డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2024లో రూ.1,402 కోట్ల ఒప్పందాన్ని పొందింది . ఆ కంపెనీ మోరి-5 బావిని దాదాపు ఒక సంవత్సరం నుండి నిర్వహిస్తోందని ఓఎన్జీసీ అధికారి ఒకరు తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe