జర్మనీలో తెలుగు విద్యార్థి మృతి.. అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం కారణంగా పై నుంచి దూకి!
జర్మనీలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరగడంతో పై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాడు. కానీ తలకు తీవ్ర గాయమై మరణించాడు.
జర్మనీలో జరిగిన ఒక అపార్ట్‌మెంట్ అగ్నిప్రమాదంలో తెలంగాణకు చెందిన విద్యార్థి మరణించాడు. మృతుడిని జనగాం జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిన్ రెడ్డిగా గుర్తించారు. హృతిన్ రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించడానికి జర్మనీకి వెళ్లాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం, అతను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి.

మంటల నుండి తప్పించుకునే ప్రయత్నంలో, హృతిన్ భవనంపై నుండి దూకడంతో తలకు తీవ్ర గాయమైనట్లు సమాచారం. ఆసుపత్రికి తరలించి చికిత్స చేసినప్పటికీ, పరిస్థితి మరింత దిగజారి గాయాలతో హృతిన్ రెడ్డి మరణించాడు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, సంఘటన కచ్చితమైన పరిస్థితులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కామారెడ్డిలో వ్యక్తి మృతి
కొత్త సంవత్సరం సందర్భంగా పోలీసులు రాష్ట్రంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. అయితే ఈ తనిఖీల్లో పోలీసులను చూసిన ఓ వ్యక్తి.. ఆపకుండా కారు వేగంగా పోనిచ్చి మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డిలో గురువారం జరిగింది. కలెక్టక్ కార్యాలయం సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అదే మార్గంలో వెళ్తున్న గోపు నరేశ్ పోలీసులను చూశాడు. పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా.. కారును వేగంగా ముందుకు తీసుకెళ్లాడు.
కారు స్పీడుగా వెళ్లి బండరాయిని బలంగా ఢీ కొట్టింది. ఈ కారణంగా కారు బోల్తా కొట్టింది. గోపు నరేశ్ ఘటన స్థలంలోనే మరణించాడు. ఘటన జరిగిన వెంటనే.. పోలీసులు అతడిని బయటకు తీశారు. కానీ అప్పటికే మృతిచెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం.. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడిది రామారెడ్డి మండలం రెడ్డిపేట్‌గా గుర్తించారు.
బిర్యానీ తిని మృతి
న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం నెలకొన్నది. బిర్యానీ తిని ఒకరు మృతి చెందారు. 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా 17 మంది మద్యం సేవించి చారు. అయితే బిర్యానీ తిన్న పాండు అనే వ్యక్తి అస్వస్థతకు గురై చనిపోయాడు. మరో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


