...
...
Next Story

Visakhapatnam Beach Road : విశాఖ బీచ్ రోడ్‌లో బ్రిక్స్ సైక్లింగ్ ర్యాలీ

విశాఖ బీచ్ రోడ్‌లో బ్రిక్స్ సమ్మిట్‌లో భాగంగా ఫ్రెండ్‌షిప్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ, బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రులు, ఇతర ప్రతినిదులు పాల్గొన్నారు.

Published on: Aug 23, 2026, 14:04:40 IST
By , Visakhapatnam
Prefer HTon Google
Advertisement

విశాఖపట్నం వేదికగా జరుగుతున్న బ్రిక్స్(BRICS) యువజన, క్రీడా శాఖ మంత్రుల సమావేశాలు 2026లో భాగంగా నిర్వహించిన బ్రిక్స్ ఫ్రెండ్‌షిప్ సైక్లింగ్ ప్రోగ్రామ్ ఘనంగా ముగిసింది. ఈ సైక్లింగ్ ర్యాలీలో బ్రిక్స్ కూటమికి చెందిన సభ్య దేశాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో విదేశీ ప్రతినిధులు వైజాగ్ నగర అందాలను, తీర ప్రాంత వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సైక్లింగ్ చేశారు.

బ్రిక్స్ సైక్లింగ్ ర్యాలీ
బ్రిక్స్ సైక్లింగ్ ర్యాలీ

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగమైన సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంతో ఈ బ్రిక్స్ ర్యాలీ అనుసంధానమైందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1,800 నగరాల్లో ఒకే రోజు నిర్వహించిన ఈ సైక్లింగ్ డ్రైవ్‌లో దాదాపు 50 లక్షల మంది యువత ఉత్సాహంగా పాల్గొని సరికొత్త ఉత్సాహాన్ని నింపారని ఆయన వెల్లడించారు.

సైక్లింగ్‌ను ఒక అత్యుత్తమ వ్యాయామంగా అభివర్ణించిన కేంద్ర మంత్రి మాండవీయ, ఇది కేవలం శారీరక ఫిట్‌నెస్‌ పెంచడానికే కాకుండా పెరుగుతున్న వాయు కాలుష్యానికి ఒక చక్కటి పరిష్కారమని కొనియాడారు. ప్రజలంతా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఆదివారం తప్పకుండా సైకిల్ తొక్కాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ సైక్లింగ్ ర్యాలీ నోవోటెల్ హోటల్ నుంచి ప్రారంభమై ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సీ హారియర్ మ్యూజియం వరకు సాగి, తిరిగి నోవోటెల్ హోటల్‌ వద్దకు చేరుకుంది. ఈ భారీ అవగాహన ర్యాలీలో పలువురు రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొని ప్రాధాన్యత పెంచారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe