తీవ్ర తుఫాన్ 'అర్నబ్' ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తీరప్రాంతాలపై విరుచుకుపడుతోంది. తుఫాన్ ధాటికి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భీకర వర్షం కురుస్తుండటంతో పెద్ద ఎత్తున చెట్లు విరిగిపడి సాధారణ ప్రజానీకం తీవ్ర అవస్థలు ఎదుర్కొంటోంది.

కోనసీమతో పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) గత 24 గంటలుగా నిరంతరం పర్యవేక్షిస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటన ప్రకారం, అర్నాబ్ తుఫాన్ బుధవారం తెల్లవారుజాము నుంచే ఆంధ్రప్రదేశ్-యానాం తీరాల మధ్య తీరం దాటే ప్రక్రియను ప్రారంభించింది. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదువుతున్నాయి.
భీకర గాలులు
తుఫాను తీరం దాటే సమయంలో దాని కేంద్ర భాగంలో గాలుల వేగం గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వరకు ఉంది. ఈ ఈదురుగాలుల తీవ్రత గరిష్ఠంగా గంటకు 150 కిలోమీటర్ల వేగాన్ని తాకుతోంది. ప్రస్తుతం ఈ తుఫాను గంటకు 3 కిలోమీటర్ల నెమ్మది వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది.
బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య, యానాంకు దక్షిణ ప్రాంతంలో తుఫాన్ తీరాన్ని దాటుతోంది. బులెటిన్ విడుదల చేసిన సమయం నుంచి దాదాపు మూడు గంటల పాటు ఈ తీరం దాటే ప్రక్రియ కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
సముద్రంలో సాధారణ అలల కన్నా 1.5 నుంచి 2.5 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అలల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా కాకినాడ, యానాం పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగే అవకాశం ఉందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
కాకినాడ, విశాఖలలో దెబ్బతిన్న మౌలిక వసతులు
{{/usCountry}}సముద్రంలో సాధారణ అలల కన్నా 1.5 నుంచి 2.5 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అలల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా కాకినాడ, యానాం పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగే అవకాశం ఉందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
కాకినాడ, విశాఖలలో దెబ్బతిన్న మౌలిక వసతులు
{{/usCountry}}తుఫాన్ ధాటికి కాకినాడలో అనేక చోట్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి, చెట్లు నేలకూలాయి. విశాఖపట్నంలో ఈదురుగాలుల ఉద్ధృతికి విరిగిపడిన చెట్లు రోడ్లపై పడటంతో ప్రముఖ బీచ్ రోడ్, సీతమ్మధార ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది.
అక్టోబరు 27 ఉదయం 8:30 గంటల నుంచి అక్టోబరు 28 తెల్లవారుజామున 3 గంటల మధ్య అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ఈ తుఫాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లోనూ బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మల్కాన్గిరి వైపు పయనం…
మరోవైపు తుఫాన్ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు పొరుగు రాష్ట్రమైన ఒడిశా కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. "ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు అనేదే మా ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం," అని ఒడిశా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారి స్పష్టం చేశారు. ఆయన బుధవారం స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమీక్ష అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, "అర్నాబ్ తుఫాన్ తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సమీపంలో తీరం దాటడం ప్రారంభించింది. చివరి సమాచారం ప్రకారం వ్యవస్థ ప్రస్తుతం స్థిరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ తీరంలోకి ప్రవేశించిన తర్వాత ఇది ఉత్తర, వాయువ్య దిశగా పయనిస్తూ ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా వైపునకు చేరుకునే అవకాశం ఉంది," అని వెల్లడించారు.