తీరం దాటుతున్న 'అర్నబ్' తుఫాన్ - ఏపీలో అతి భారీ వర్షాలు, పెనుగాలులతో బీభత్సం..!
తీవ్ర తుఫానd 'అర్నబ్' ఏపీ-యానాం మధ్య తీరం దాటుతోంది. గంటకు 150 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో కాకినాడ, విశాఖల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఏపీ, ఒడిశా, బెంగాల్‌లలో భారీ వర్ష హెచ్చరికలు జారీయ్యాయి.
తీవ్ర తుఫాను 'అర్నబ్' ఆంధ్రప్రదేశ్, యానాం తీరప్రాంతాలపై విరుచుకుపడుతోంది. బుధవారం తెల్లవారుజాము నుంచి తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైందని….. రాబోయే 3 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తుండగా, భీకరమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అర్నబ్ తుఫాను ప్రస్తుతం గంటకు 3 కిలోమీటర్ల నెమ్మది వేగంతో వాయువ్య దిశగా పయనిస్తోంది. తీరం దాటే సమయంలో తుఫాను తీవ్రత తీవ్ర స్థాయిలో ఉంది. తీరప్రాంతాల్లో సాధారణ గాలుల వేగం గంటకు 125 నుంచి 135 కిలోమీటర్లు ఉండగా, ఈదురుగాలుల వేగం గంటకు 150 కిలోమీటర్ల వరకు చేరుకుంటోందని అధికారులు తెలిపారు.
బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య, ముఖ్యంగా యానాంకు దక్షిణంగా అర్నబ్ తుఫాను తీరాన్ని దాటుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు గాలుల తీవ్రత తీవ్ర స్థాయిలో కొనసాగి, ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఐఎమ్‌డీ వెల్లడించింది.
తుఫాను ధాటికి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. కాకినాడలోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలుల కారణంగా పెద్ద ఎత్తున చెట్లు నేలకూలాయి, విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విశాఖపట్నంలోని ప్రముఖ బీచ్ రోడ్, సీతమ్మధార తదితర ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడటంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సముద్రంలో అలల ఉద్ధృతి…
సముద్ర అలల ఉద్ధృతిపై వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సముద్రమట్టం కంటే 1.5 నుంచి 2.5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని, దీనివల్ల రాబోయే 4 నుంచి 5 గంటల్లో కోస్తాంధ్రలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా కాకినాడ, పుదుచ్చేరి పరిధిలోని యానాం ప్రాంతాల్లో అలల తీవ్రత అత్యధికంగా ఉంటుందని అంచనా వేశారు.
అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో అక్టోబరు 27 ఉదయం 8:30 గంటల నుంచి అక్టోబరు 28 తెల్లవారుజామున 3 గంటల మధ్య 200 మిల్లీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదైంది.
అర్నబ్ తుఫాన్ ప్రభావం పొరుగు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశాలపై కూడా తీవ్రంగా పడింది. పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నాయి.
మరోవైపు, ఒడిశాలో ఐఎమ్‌డీ తీవ్ర వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. గజపతి, గంజాం, రాయగడ, కోరాపుట్, నవరంగ్‌పూర్, మల్కాన్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాల్లో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే ప్రమాదం ఉందని వెల్లడించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

