అర్నబ్ తుపాను తీవ్రత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ ప్రతి గంటకూ దాని కదలికలను నిశితంగా పరిశీలించి ముందస్తు చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సమర్థవంతమైన నిర్వహణ వల్లనే తుపాను తీవ్రత నుంచి భారీగా ప్రాణనష్టాన్ని నివారించగలిగామని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, దెబ్బతిన్న పంటలను పరిశీలించి బాధితులను పరామర్శించారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ. 4,600 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. రాష్ట్రంలో సంభవించిన నష్టంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడి తక్షణ సహాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో నష్ట పరిమాణాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు శుక్రవారం రాష్ట్రంలో పర్యటిస్తున్నాయి.
తుపాను హెచ్చరికలు అందగానే సుమారు 30 వేల మంది ప్రభుత్వ అధికారులను, సిబ్బందిని సహాయక చర్యల కోసం వెంటనే రంగంలోకి దించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ గోడలు కూలడం, విద్యుత్ షాక్ వంటి ప్రమాదాల వల్ల ఏడుగురు వ్యక్తులు మృతి చెందడం ఎంతో విచారకరమని, వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.
రూ.500 కోట్ల మేర నష్టం
అర్నబ్ తుపానుతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి, వీలైనంత త్వరగా సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తుపాను కారణంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు ప్రాథమికంగా సుమారు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు మంత్రి తెలిపారు. పూర్తిస్థాయి అంచనాల అనంతరం నష్టం వివరాలు వెల్లడవుతాయన్నారు. ప్రస్తుతం 1,700 మంది సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారని, రాష్ట్రంలోని మూడు డిస్కమ్‌ల నుంచి అదనంగా మరో 500 మందిని రప్పిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ నుంచి కూడా 500 మంది విద్యుత్ సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో భాగస్వాములయ్యారని చెప్పారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అవసరమైన సిబ్బంది, నిధులు, సామగ్రి విషయంలో కొరత రానివ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. దెబ్బతిన్న స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం, తెగిపోయిన తీగలను సరిచేయడం, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
{{/usCountry}}విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అవసరమైన సిబ్బంది, నిధులు, సామగ్రి విషయంలో కొరత రానివ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. దెబ్బతిన్న స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం, తెగిపోయిన తీగలను సరిచేయడం, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
{{/usCountry}}అర్నబ్ తుపాను ప్రభావం పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్ వ్యవస్థపై తీవ్రంగా పడిందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. జిల్లాలో సుమారు 3,700 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారని, దాదాపు 400 గ్రామాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. తుపాను తీరం దాటిన నరసాపురం, పరిసర గ్రామాల్లో నష్టం అధికంగా ఉందన్నారు. ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, ఒక ప్రాంతంలో పనులు పూర్తయిన వెంటనే అక్కడి సిబ్బందిని మరో ప్రాంతానికి తరలించి పునరుద్ధరణ వేగం పెంచాలని సూచించారు. అవసరమైన చోట అదనపు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర సామగ్రిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
విద్యుత్ అంతరాయంతో గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పూర్తయ్యే వరకు అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో తాగునీరు అందించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
తుపానుతో దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, తుపాను బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, రోడ్లపై పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని ఆదేశించారు. విద్యుత్, రెవెన్యూ, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, వ్యవసాయ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.