ఆంధ్రప్రదేశ్‌లో మెుంథా తుపాను ప్రభావం ముదలైంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గోదావరి జిల్లాలు, కృష్ణాలో వర్షాలు పడుతున్నాయి. ఇతర జిల్లాల్లోనూ వానలు కురుస్తున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారడంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే అలర్ట్ అయింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని 43 రైళ్లను రద్దు చేశారు. అక్టోబర్ 27, 28, 29వ తేదీల్లో పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన సర్వీసులను రద్దు చేస్తున్నట్టుగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఈ మేరకు రద్దు చేసిన రైళ్ల జాబితాను ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రయాణికులు తమ ప్రయాణనికి ముందు రైలు స్టేటస్ చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
తుపాను తీవ్రత ఆధారంగా కొన్నింటిని రద్దు, దారి మళ్లింపు చేస్తారు. ఇప్పటికే కాకినాడ తీరంలో తుపాను అలజడి ముదలైంది. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు పడనున్నాయి. తుపాను దగ్గరకు వచ్చే కొద్ది తీవ్రత పెరగనుంది. అక్టోబర్ 28న సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నంలో తుపాను తీరం దాటనుంది.
మొంథా తుపాను నేపథ్యంలో ఇప్పటికే ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కాకినాడ జిల్లాలో దీని ప్రభావం ఎక్కువ ఉండనున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు ఈ నెల 27 నుంచి 31 తేదీ వరకు సెలవులు ప్రకటించారు. తుపాను దెబ్బకు కాకినాడ, విశాఖ, మచిలీపట్నం పోర్టులను మూసివేశారు. పలు ప్రాంతాలకు హై అలర్ట్ జారీ చేశారు. అనవసరమైన ప్రయాణాలు చేయుద్దని అధికారులు హెచ్చరించారు.
{{/usCountry}}మొంథా తుపాను నేపథ్యంలో ఇప్పటికే ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కాకినాడ జిల్లాలో దీని ప్రభావం ఎక్కువ ఉండనున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు ఈ నెల 27 నుంచి 31 తేదీ వరకు సెలవులు ప్రకటించారు. తుపాను దెబ్బకు కాకినాడ, విశాఖ, మచిలీపట్నం పోర్టులను మూసివేశారు. పలు ప్రాంతాలకు హై అలర్ట్ జారీ చేశారు. అనవసరమైన ప్రయాణాలు చేయుద్దని అధికారులు హెచ్చరించారు.
{{/usCountry}}తుపాను 18 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. మంగళవారానికి తీవ్ర తుపానుగా మారనుంది. అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరం దాటనుంది. తుపాను ప్రభావంతో తీరం వెంట ఈదురుగాలుల తీవ్రత పెరుగుతూ ఉంది. అనకాపల్లి జిల్లాలోని పలు తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. పర్యాటకులు ఎవరూ రావొద్దని అధికారులు హెచ్చరించారు.
మెుంథా తుపాను ప్రభావం ముదలై విశాఖ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు జలాశయాల వద్ద హై అలర్ట్ ప్రకటించారు.