కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారు అత్యంత నైవేద్య ప్రియుడు. ఏడుకొండలపైన నిత్యోత్సవం, వారోత్సవాలతో అలరారే శ్రీవారి ఆలయంలో స్వామివారికి ప్రతిరోజూ వివిధ రకాల అన్నప్రసాదాలు, పిండి వంటలు, రుచికరమైన పణ్యారాలను అత్యంత శాస్త్రోక్తంగా నివేదిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో జరిగే పూజా కైంకర్యాలకు అనుగుణంగా ఆయా సమయాల్లో ప్రత్యేకమైన ప్రసాదాలను సమర్పించడం యుగాలుగా వస్తున్న పవిత్ర ఆనవాయితీ.

తిరుమల ఆలయంలో నైవేద్యాల తయారీ అంతా ప్రాచీన వైఖానస ఆగమ సంప్రదాయాల ప్రకారం అత్యంత పవిత్రతతో జరుగుతుంది. ఆలయంలోని అత్యంత పావనమైన 'పోటు' (వంటశాల)లో అర్చకులు, పోటు సిబ్బంది మడిచారాలతో ఈ ప్రసాదాలను సిద్ధం చేస్తారు. నైవేద్య తయారీలో ఉపయోగించే పదార్థాలు, పాత్రలు, వంట చేసే విధానాలకు ఆగమ శాస్త్రంలో విశిష్ట ప్రాధాన్యం ఉంది.
శ్రీవారి నైవేద్యాల తయారీలో ఉన్న ఒక ప్రధానమైన విశేషం ఏమిటంటే…. ఎక్కడా ఎండుమిర్చి గానీ, పచ్చిమిర్చి గానీ ఉపయోగించరు. దానికి బదులుగా కేవలం నల్లమిరియాలను మాత్రమే కారానికి, రుచికి ప్రామాణికంగా వినియోగిస్తారు. ఇది యుగయుగాలుగా వస్తున్న ప్రాచీన నియమం.
ప్రాచీన పేర్లు
మనం నిత్యం పిలుచుకునే సాధారణ పేర్లకు, వైఖానస పరిభాషలోని ఆగమ నామాలకు ఎంతో వ్యత్యాసం ఉంది.
- పులిహోరను ‘తింత్రిణీరసాన్నం’ అని పిలుస్తారు.
- నెయ్యి పొంగలిని ‘ముద్గాన్నం’ అని వ్యవహరిస్తారు.
- బెల్లం అన్నం / చక్ర పొంగలిని ‘గుడాన్నం’ అని అంటారు.
- మిరియాల అన్నాన్ని ‘మరీచ్యాన్నం’ అని పిలుస్తారు.
- తిరుమల ప్రసిద్ధ వడను ‘మాషాపూపం’ అని అంటారు.
- దోశను ‘చక్రప్పం’ అని వ్యవహరిస్తారు.
నిత్యం 45 రకాల ప్రసాదాలు….
శ్రీవారికి అనునిత్యం మొత్తం 45 రకాల దివ్య ప్రసాదాలను నివేదిస్తారు. వీటిలో 20 రకాల అన్న ప్రసాద నైవేద్యాలు కాగా, మిగిలిన 25 రకాలు పిండివంటలు మరియు పణ్యారములు కావడం గమనార్హం.
- మొదటి గంట అనంతరం (ఉదయపు నైవేద్యం): ఆలయంలో ఉదయం మొదటి గంట మోగిన తర్వాత స్వామివారికి మాత్రాన్నం, ముద్గాన్నం (నెయ్యి పొంగలి), తింత్రిణీరసాన్నం (పులిహోర), దధ్యోదనం (పెరుగన్నం), గుడాన్నం (బెల్లం అన్నం), శాకాన్నం (కదంబం), శర్కరాన్నం (రవ్వకేసరి) సమర్పిస్తారు. వీటితో పాటు నిత్యం నాలుగు రకాల పణ్యారాలైన లడుకం (లడ్డు), మాషాప్పం (వడ), గుడప్పం (అప్పం), చక్రప్పం (దోశ) నివేదిస్తారు.
- రెండో గంట అనంతరం (రాజభోగం / మధ్యాహ్న నైవేద్యం): మధ్యాహ్న కాలంలో రెండో గంట మోగిన పిమ్మట రాజభోగ కైంకర్యం జరుగుతుంది. ఈ సమయంలో శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గుడాన్నం, దధ్యోదనం, శీరా లేదా శక్కరభాత్ వంటి నైవేద్యాలను ఆరగింపుగా సమర్పిస్తారు.
- మూడో గంట అనంతరం (శయనభోగం / రాత్రి నైవేద్యం): రాత్రి వేళ మూడో గంట మోగిన తర్వాత శయనభోగం నిర్వహిస్తారు. ఈ సమయంలో మరీచ్యాన్నం (మిరియాల అన్నం), చక్రప్పం (దోశ), లడుకం (లడ్డు), మాషాప్పం (వడ), శర్కరాన్నం మొదలైనవాటిని నివేదిస్తారు.
సాయంకాల ఆరాధన – ఏకాంత సేవా వైభవం
సాయంత్రం గర్భాలయాన్ని శుభ్రపరిచి, స్వామివారిని నూతన దివ్య పుష్పాలతో అలంకరించిన తర్వాత ప్రత్యేక కైంకర్యాలు నిర్వహిస్తారు. శయనభోగం అనంతరం అర్ధరాత్రి సమయంలో స్వామివారికి ‘తిరువీసం’ అనే పవిత్ర నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇందులో తెల్ల అన్నంతో పాటు బెల్లంతో చేసిన రుచికరమైన గుడాన్నం ఉంటుంది.
{{/usCountry}}సాయంత్రం గర్భాలయాన్ని శుభ్రపరిచి, స్వామివారిని నూతన దివ్య పుష్పాలతో అలంకరించిన తర్వాత ప్రత్యేక కైంకర్యాలు నిర్వహిస్తారు. శయనభోగం అనంతరం అర్ధరాత్రి సమయంలో స్వామివారికి ‘తిరువీసం’ అనే పవిత్ర నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇందులో తెల్ల అన్నంతో పాటు బెల్లంతో చేసిన రుచికరమైన గుడాన్నం ఉంటుంది.
{{/usCountry}}రోజులో చివరి ఘట్టంగా జరిగే ఏకాంత సేవలో శ్రీనివాసుడికి వెచ్చని పాలు, కాలానికి అనుగుణంగా లభించే పండ్ల ముక్కలు, ప్యూర్ నెయ్యిలో వేయించిన ఎండుద్రాక్ష, జీడిపప్పు వంటి ఎండు ఫలాలను నివేదించి పవళింపు సేవ పూర్తి చేస్తారు. వైఖానస ఆగమ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ నైవేద్య సేవలు తిరుమల క్షేత్ర మహత్యానికి, సనాతన వైదిక వైభవానికి నిలువెత్తు నిదర్శనం.