శరన్నవరాత్రి మహోత్సవాలు.. దసరా పర్వదినాన కృష్ణమ్మ ఒడిలో తెప్పోత్సవం
దసరా పర్వదినాన కృష్ణమ్మ ఒడిలో తెప్పోత్సవం కన్నుల పండువగా జరగనుంది. హంస వాహనంపై అమ్మవారిని, స్వామివారి ఊరేగించనున్నారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో అత్యంత ఘట్టమైన, భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెప్పోత్సవం అక్టోబర్ 20న కృష్ణానదిలో కన్నుల పండువగా నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. గత రెండేళ్లుగా కృష్ణా నదికి వచ్చిన వరదల కారణంగా రద్దయిన ఈ దివ్య వేడుక, ఈ ఏడాది ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగనుండటంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది.

దసరా నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే తెప్పోత్సవం కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని, స్వామివారిని తెప్పపై కొలువుచేసి కృష్ణానదిలో విహరింపజేసేందుకు వీలుగా హంస వాహనాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. దుర్గాఘాట్ వద్ద అధికారులు ఇప్పటికే హంస వాహన తెప్పపై ట్రయల్ రన్ నిర్వహించి, అన్ని ఏర్పాట్లను పరిశీలించారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు, ఆలయ ఈఓ వి.కె. సీనా నాయక్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ తదితర ఉన్నతాధికారులు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భద్రతా చర్యలు, సాంకేతిక ఏర్పాట్లు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీసులు ఘాట్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో స్నాన ఘాట్ల వద్ద నిపుణులైన ఈతగాళ్లను మోహరించారు. దుర్గా ఘాట్, పున్నమి ఘాట్, హంస వాహనాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు.
తెప్పోత్సవానికి ముందు ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీసులు దేవతా మూర్తులను బ్రాహ్మణ వీధి గుండా ఘనంగా ఊరేగింపుగా తీసుకెళ్తారు. జమ్మిదొడ్డిలో షమీ పూజ, పార్వేట ఉత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు.
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కనకదుర్గమ్మ ప్రసిద్ధ లడ్డు ప్రసాదానికి విపరీతమైన డిమాండ్ ఉండటంతో, ఎలాంటి కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. దసరా ఉత్సవాలు ప్రారంభమైన తొలి ఏడు రోజుల్లోనే భక్తులు 14,11,393 లడ్డూలను కొనుగోలు చేశారు. ఈ ఏడాది సుమారు 25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేయగా, కొరత రాకుండా ఉండేందుకు అదనంగా మరో 30 లక్షల లడ్డూలను తయారు చేయాలని అధికారులు నిర్ణయించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంతో పాటు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఆన్‌లైన్ సేవలతో కలిపి మొత్తం 19 కౌంటర్లను అందుబాటులోకి తెచ్చారు.
అక్టోబర్ 11న ప్రారంభమైన ఈ నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 20న తెప్పోత్సవంతో ముగియనున్నాయి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవడానికి, కృష్ణానదిలో జరిగే తెప్పోత్సవాన్ని కనులారా వీక్షించడానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


