గ్రామ స్థాయిలో మెరుగైన సేవలు అందించేందుకు డీడీఓ కార్యాలయాలు : పవన్ కల్యాణ్
ప్రజలకు మరింత చేరువయ్యేలా పంచాయతీరాజ్ వ్యవస్థను తయారు చేస్తున్నట్టుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. డీడీఓ కార్యాలయాల ద్వారా సంక్షేమ, అభివృద్ధి సమన్వయం జరుగుతుందని చెప్పారు.
చిత్తూరులో కొత్త డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(డీడీఓ) కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో అదనంగా 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పౌరులకు మెరుగైన సౌకర్యాలను అందించడంలో గ్రామీణాభివృద్ధి శాఖ పాత్రను పవన్ కల్యాణ్ నొక్కి చెప్పారు.

'సమాజానికి సేవ చేసే, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇచ్చే 77 డీడీఓ కార్యాలయాలను ప్రారంభించడం నాకు సంతోషంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉద్యోగుల పదోన్నతులు ఉన్నాయి. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ఐటీ విభాగాన్ని తీసుకొస్తాం.' అని పవన్ కల్యాణ్ అన్నారు.
ప్రజలకు మరింత చేరువయ్యేలా పంచాయతీరాజ్ వ్యవస్థను తయారు చేస్తున్నట్టుగా పవన్ కల్యాణ్ చెప్పారు. డీడీఓ కార్యాలయాల ద్వారా సంక్షేమ, అభివృద్ధి సమన్వయం జరుగుతుందన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అధికారులకు పదోన్నతులు ఇచ్చామని చెప్పారు. సులభంగా, సత్వరంగా ప్రజలకు సేవలందించేలా ఏర్పాటు చేస్తున్నట్టుగా పవన్ తెలిపారు. నూతన సంస్కరణలతో సరికొత్తగా బాధ్యతలు ఉంటాయన్నారు.
'ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర పంచాయతీలకు సహాయ సహకారాలు అందుతున్నాయి. చంద్రబాబు సారథ్యంలో నిధులను సక్రమంగా వినియోగించే బాధ్యత తీసుకున్నాం. డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది.' అని పవన్ కల్యాణ్ అన్నారు.
డివిజన్ స్థాయిలో ప్రభుత్వ పథకాలను పారదర్శకతతో అమలు చేయాలని వర్చువల్ సమావేశంలో పవన్ చెప్పారు. ఈ కార్యాలయాల ద్వారా డివిజన్ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు సమీకృతం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యాలయాలు ఉండటం వల్ల మరింత ఫలితాలు సాధించాలని చెప్పారు. ఎలాంటి సిఫారసులు లేకుండా అధికారులు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు.
'సామర్థ్యం పెంచేందుకు శిక్షణా సంస్థలను బలోపేతం చేస్తాం. పంచాయతీ రాజ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఐటీ విభాగం. గ్రామ స్థాయిలో మెరుగైన సేవలు అందించేందుకు డీడీఓ కార్యాలయాలు ఉపయోగపడతాయి.' అని పవన్ కల్యాణ్ అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


