Telugu States Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మే నెల ప్రారంభం కావడంతోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 72 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…. అనవసరంగా బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఏపీలో ఇవాళ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉండనుంది. గుంటూరు జిల్లా మేడికొండూరు, పెదనందిపాడు,ఫిరంగిపురం, ప్రత్తిపాడు,తుళ్లూరు,వట్టిచెరుకూరు మండలాల్లో తీవ్ర, మరో 124 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. శనివారం ప్రకాశం జిల్లాలోని కొప్పెరపాడులో 45.4°C, మార్కాపురం జిల్లాలోని బొట్లగూడూరులో 45.1డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇదే సమయంలో పలు జిల్లాల్లో వర్షాలు కూడా పడొచ్చని అంచనా వేసింది. ద్రోణి ప్రభావంతో ఇవాళ(మే 3) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల పూర్తిగా పొడివాతవరణ పరిస్థితులు ఉండనున్నాయి.
వర్ష సూచనల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
తెలంగాణలోనూ భిన్న వాతావరణం….
తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 నుండి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌లోనూ ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వర్ష సూచన…
ఇక తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ కూడా ఇచ్చింది. ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా... కొమరంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
{{/usCountry}}ఇక తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ కూడా ఇచ్చింది. ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా... కొమరంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
{{/usCountry}}మే 4వ తేదీన ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.