ఆటోలపై డిజిటల్ స్టిక్కర్లు.. ప్రయాణం ఇక మరింత సేఫ్.. ఒక్క క్లిక్‌తో మీ ఫోన్లో ఈ వివరాలు!
Auto Digitalization : ఆటో ఎక్కితే చాలా మందికి భయం. ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆటోలకు డిజిటల్ స్టిక్కర్లతో డ్రైవర్ మెుత్తం వివరాలు మీ చేతిలో ఉంటాయి. ఫిర్యాదు చేయవచ్చు.
ఒంగోలులోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆటోరిక్షాల కోసం డిజిటలైజేషన్ చొరవలో భాగంగా ట్రాఫిక్ డిజిటల్ నంబర్ స్టిక్కర్‌లను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వి. హర్షవర్ధన్ రాజు ఆవిష్కరించారు. ఇప్పుడు ఆటో ఎక్కిన తర్వాత ప్రయాణికులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు, ఫోటో తీసుకోవచ్చు. ఆటో డ్రైవర్, యజమాని పూర్తి వివరాలు వారి మొబైల్ ఫోన్‌లలో కనిపిస్తాయి.

ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం స్వీకరణకు అనుగుణంగా, ఒంగోలు పట్టణంలో ఆటోలకు ప్రత్యేక డిజిటల్ నంబర్ స్టిక్కర్‌లను అటాచ్ చేసే ప్రక్రియ ప్రారంభించాం. ఈ డిజిటల్ నంబర్‌లను కేటాయించడం ముఖ్య ఉద్దేశం ప్రయాణికులకు ఆటోల పూర్తి వివరాలను అందించడం, వారు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకునేలా చూడటం.' అని చెప్పారు.
ఈ వ్యవస్థ ద్వారా ఆటోలను సులభంగా గుర్తించడం, ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడం, ప్రజలకు మరింత భద్రత కల్పించడం అనే లక్ష్యంతో పోలీసు శాఖ ఒక వినూత్న చర్య తీసుకుంది. డిజిటల్ నంబర్ స్టిక్కర్ల ద్వారా ప్రతి ఆటోకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండటంతో, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు సమాచారాన్ని వేగంగా గుర్తించగలుగుతారు.
ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో ముఖ్యంగా మహిళలు, వృద్ధులతో మర్యాదగా, గౌరవంగా వ్యవహరించాలని ఎస్పీ హర్షవర్ధన్ సూచించారు. మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపవద్దని, డ్రైవర్ సీటు పక్కన అనవసరంగా ప్రజలను కూర్చోబెట్టవద్దని కూడా హెచ్చరించారు. ప్రయాణికుల నుండి అధిక ఛార్జీలు వసూలు చేయవద్దని తెలిపారు.
ఈ కార్యక్రమం కింద ప్రతి ఆటోరిక్షాకు డ్రైవర్, వాహన యజమాని పూర్తి వివరాలను కలిగి ఉన్న ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌తో పొందుపరిచిన రెండు A4-సైజు డిస్‌ప్లే బోర్డు స్టిక్కర్లు జారీ చేస్తారు. గూగుల్ లెన్స్ ఉపయోగించి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు. వీటిలో డ్రైవర్ వివరాలు, వాహన సమాచారాన్ని కుటుంబ సభ్యులతో వాట్సాప్ ద్వారా పంచుకోవడం, వాహనం స్థానాన్ని ట్రాక్ చేయడం, అత్యవసర పరిస్థితుల్లో పోలీసు కంట్రోల్ రూమ్‌ను అలర్ట్ చేయడం, డ్రైవర్ ప్రవర్తనను ఫిర్యాదు చేయడం, 112కు అత్యవసర కాల్‌లు చేయడం, సమీప పోలీసు స్టేషన్‌ల కోసం కాంటాక్ట్ నంబర్‌లను వీక్షించడం వంటి ఎంపికలు ఉన్నాయి. ప్రయాణికులు www.todaysafejourney.com వెబ్‌సైట్ ద్వారా వివిధ వివరాలు చూడవచ్చు.
డిజిటల్ స్టిక్కర్లను పొందడానికి ఆటో యజమానులు, డ్రైవర్లు తమ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, పూర్తి వాహన వివరాలను ట్రాఫిక్ పోలీసులకు సమర్పించాలి. వారు ప్రత్యేక వెబ్‌సైట్‌లో సమాచారాన్ని నమోదు చేసి క్యూఆర్-కోడెడ్ స్టిక్కర్లను జారీ చేస్తారు. ఒంగోలు అంతటా ఉన్న అందరూ ఆటో డ్రైవర్లు, యజమానులు పోలీసులకు సహకరించి వీలైనంత త్వరగా నమోదు చేసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ కోరారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












