ఈ కొత్త సంవత్సరం వేళ ఏపీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. కిలో గోధుమ పిండిని కేవలం 20 రూపాయలకే అందిస్తోంది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 1వ తేదీ నుంచి పౌరసరఫరాల శాఖ ప్రారంభించింది. ప్రస్తుతానికి పైలెట్ ప్రాజెక్ట్ కింద పట్టణ ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా కిలో గోధుమ పిండిని అందజేయనుంది.
రూ. 20కే కిలో….

బహిరంగ మార్కెట్‌లో కిలో గోధుమ పిండి ధర 60 నుంచి 65 రూపాయల వరకు ఉండగా, ప్రభుత్వం చౌక దుకాణాల్లో కేవలం 20 రూపాయలకే అందిస్తోంది.ముందుగా పట్టణ ప్రాంతాల్లో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ విజయవంతమైతే…. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తారు. ఇప్పటికే రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు రాగులు, జొన్నలు కూడా అందిస్తున్నారు. తాజాగా గోధుమ పిండి కూడా రేషన్ కార్డుదారులకు అందనుంది.
ప్రతి కుటుంబానికి పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం అమలులోకి వచ్చింది. సహజంగా చెక్కి తయారు చేసిన నాణ్యమైన గోధుమ పిండిని అతి తక్కువ ధరలో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని అధికారులు చెబుతున్నారు. నాణ్యత తనిఖీ తర్వాత సురక్షిత ప్యాకింగ్‌తో పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొని ప్రభుత్వం చేపట్టిన ఈ సదుపాయాన్ని…. రేషన్ కార్డుదారులందరూ వినియోగించుకోవాలని కోరారు.
మరోవైపు రాష్ట్కరంలో స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన వారు… ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ-కేవైసీ చేయించుకోలేదు. ఈ ప్రాసెస్ వారి రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది. వేలిముద్ర ద్వారా లబ్ధిదారుని ధ్రువీకరించే ప్రక్రియనే ఈకైవీసీ అంటారు. దీంతో నకిలీ రేషన్ కార్డులను పూర్తిగా తొలగించవచ్చు.
ఈకేవైసీ పకడ్బందీగా నిర్వహించటం ద్వారా… నకిలీ లబ్ధిదారులను ఏరివేస్తారు. సరుకుల పంపిణీ పారదర్శకంగా ఉంటుంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ఈకేవైసీ సమాచారాన్ని సేకరిస్తోంది.
{{/usCountry}}ఈకేవైసీ పకడ్బందీగా నిర్వహించటం ద్వారా… నకిలీ లబ్ధిదారులను ఏరివేస్తారు. సరుకుల పంపిణీ పారదర్శకంగా ఉంటుంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ఈకేవైసీ సమాచారాన్ని సేకరిస్తోంది.
{{/usCountry}}రేషన్ డీలర్ షాప్ లో ఈకేవైసీ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.గ్రామ / వార్డు సచివాలయాల్లో కూడా ఈ ప్రాసెస్ చేస్తారు.E-PoS(ఈ పోస్) యంత్రంలో వేలిముద్ర పెట్టగానే E-KYC పూర్తవుతుంది. మరోవైపు కార్డు ఇప్పటివరకు తీసుకొనివారు.. ఆయా రేషన్ షాపుల వద్దకు తీసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
కాబట్టి ఈకేవైసీ విషయంలో లబ్ధిదారులు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా… 3 నెలలుగా రేషన్ తీసుకోకుండా ఉండొద్దు, ఈ 2 విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే కార్డు రద్దవుతోంది.