Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్... విశాఖ - పార్వతీపురం మధ్య ప్రత్యేక మెము రైళ్లు! పాట్నా రూట్ లోనూ

దీపావళి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం-పార్వతీపురం మధ్య ప్రత్యేక మెము రైళ్లను దక్షిణ కోస్తా రైల్వే ప్రకటించింది. నవంబర్ 9 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. మరోవైపు పాట్నాకు కూడా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.

Published on: Nov 7, 2026, 15:07:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దీపావళి పండగ వేళ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే తీపి కబురు చెప్పింది. పండగ రోజుల్లో రైళ్లలో పెరిగే తీవ్ర ప్రయాణికుల రద్దీని తగ్గించటంతో పాటు…. ఉత్తరాంధ్ర ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చేందుకు విశాఖపట్నం - పార్వతీపురం మధ్య ప్రత్యేక మెము (MEMU) రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

వారాంతపు రోజులు, దీపావళి పండగ సమ్మేళనంతో ఈ మార్గంలో ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని నవంబర్ 7, 8, 9 తేదీలలో మొత్తం మూడు సర్వీసులు ఈ ప్రత్యేక రైలు సర్వీసు అందుబాటులో ఉంటుంది.

  • విశాఖపట్నం - పార్వతీపురం (రైలు నంబర్ 07268): ఈ ప్రత్యేక రైలు ప్రతిరోజూ ఉదయం 10:00 గంటలకు విశాఖపట్నం స్టేషన్ నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 12:25 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది.
  • పార్వతీపురం - విశాఖపట్నం (రైలు నంబర్ 07267): తిరుగు ప్రయాణంలో ఈ రైలు పార్వతీపురంలో మధ్యాహ్నం 12:35 గంటలకు బయలుదేరి, సాయంత్రం 04:00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

హాల్టింగ్ స్టేషన్లు:

ఈ ప్రత్యేక మెము రైలు ప్రయాణికుల సౌకర్యార్థం మార్గమధ్యలో సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, కోమటిపల్లి, డొంకనవలస, బొబ్బిలి, సీతానగరం, నర్సీపురం స్టేషన్లలో ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైలు సర్వీసులతో ఉద్యోగులు, వ్యాపారులు, పండగకు స్వగ్రామాలకు వెళ్లే రోజువారీ ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది. సాధారణ రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ మెము రైలును ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

పాట్నాకు ప్రత్యేక రైళ్లు :

దీపావళి, ఛట్ పూజ పండగల సందర్భంగా రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ - పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది.

  • విశాఖపట్నం - పాట్నా ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 08588): ఈ ప్రత్యేక రైలు ఆదివారం సాయంత్రం 19:25 గంటలకు విశాఖపట్నం స్టేషన్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు అంటే సోమవారం రాత్రి 20:00 గంటలకు పట్నా చేరుకుంటుంది. ఈ సర్వీసు నవంబర్ 15, 2026 మరియు నవంబర్ 22, 2026 తేదీలలో మొత్తం 2 ట్రిప్పులు అందుబాటులో ఉంటుంది.
  • పాట్నా - విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 08587): తిరుగు ప్రయాణంలో ఈ రైలు సోమవారం రాత్రి 21:50 గంటలకు పట్నాలో బయలుదేరి, బుధవారం తెల్లవారుజామున 00:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ తిరుగు ప్రయాణ సర్వీస్ నవంబర్ 16, 2026 మరియు నవంబర్ 23, 2026 తేదీలలో 2 ట్రిప్పులు నడుస్తుంది.

ఈ రైళ్లు విజయనగరం జంక్షన్, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస, ఇచ్చాపురం, బ్రహ్మపూర్ తో పాటు పలు స్టేషన్లలో ఆగుతుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More