...
...
Next Story

స్మార్ట్ రేషన్ కార్డుపై ఈ అప్డేట్ తెలుసా? ఒకవేళ తీసుకోకుంటే ఏంటి పరిస్థితి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులపై అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ 15వ తేదీలోపు స్మార్ట్ రేషన్ కార్డు తీసుకోకుంటే మరో విధంగా తీసుకోవచ్చు.

Published on: Dec 9, 2025, 16:44:04 IST
Advertisement

ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలకు సులభంగా, పారదర్శకంగా రేషన్ అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అక్రమార్కులకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఆగస్టు నుంచి వీటిని పంపిణీ చేస్తోంది ఏపీ. ఇప్పటికే చాలా వరకు పంపిణీ చేసింది.

స్మార్ట్ రేషన్ కార్డు
స్మార్ట్ రేషన్ కార్డు

గ్రామ, వార్డు సచివాలయాల్లో అధికారులకు అప్పగించే బాధ్యతను ఇచ్చింది. అంతేకాదు వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. ఈ నెల 15వ తేదీ వరకు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అయితే చాలా మంది లబ్ధిదారులు ఇంకా వాటిని తీసుకోలేదు. వేలాది కార్డులు పంపిణీ చేయలేదు. 15వ తేదీ తర్వాత వాటిని కమిషనరేట్‌కు పంపనున్నారు.

గడువు దగ్గరకు వచ్చినా.. సరే అర్హులైన కొందరు స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకోలేదు. ఇంకా చాలా కార్డులు పంపిణీ కోసం ఎదురుచూస్తున్నాయి. కొందరికి కార్డులు తీసుకోవాలని సమాచారం ఇస్తున్నా స్పందించడం లేదని అధికారులు చెబుతున్నారు. సచివాలయ సిబ్బంది, డీలర్లు వారికి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసిన కొన్ని ప్రాంతాల్లో కుదరడం లేదు.

అయితే ప్రస్తుతం అందుబాటులో లేకుండా ఉన్నవారు స్మార్ట్ రేషన్ కార్డు తీసుకోకపోవడంపై ఆందోళనలో ఉన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గడువు ఈ నెల 15వ తేదీతో ముగుస్తుంది. ఒకవేళ కార్డులు తీసుకోకుంటే రద్దు చేస్తారని చాలా మంది అపొహలో ఉన్నారు. కానీ ప్రభుత్వం ఆ విధంగా చేయదు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe