బెంగళూరు మార్గంలో ప్రయాణించే రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. క్రాంతివీర సంగొల్లి రాయణ్ణ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌లో యార్డ్ రీమోడలింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జూలై, ఆగస్టు నెలల్లో నడిచే పలు రైలు సర్వీసులపై తీవ్ర ప్రభావం పడనుంది. సౌత్ కోస్ట్ రైల్వే విడుదల చేసిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల గుండా నడిచే రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మరికొన్ని కీలక రైళ్లను ఇతర మార్గాల్లోకి మళ్లించారు.

రైల్వే స్టేషన్ పరిధిలో ప్రీ-నాన్ ఇంటర్‌లాకింగ్ , నాన్ ఇంటర్‌లాకింగ్ (NI) పనుల నిర్వహణ కోసమే ఈ తాత్కాలిక మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునే ముందే రైళ్ల తాజా షెడ్యూల్‌ను సరిచూసుకోవాలని సూచించారు.
పూర్తిగా రద్దయిన రైళ్ల వివరాలు
- రైలు నంబర్ 17289 (కాకినాడ టౌన్ – మైసూర్ ఎక్స్‌ప్రెస్): 2026 జూలై 31న ప్రయాణించాల్సిన సర్వీసును రద్దు చేశారు.
- రైలు నంబర్ 17290 (మైసూర్ – కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్): 2026 ఆగస్టు 1న ప్రయాణించాల్సిన సర్వీసును రద్దు చేశారు.
- రైలు నంబర్ 05074 (లాల్ కువాన్ – కేఎస్‌ఆర్ బెంగళూరు): 2026 ఆగస్టు 1న నడవాల్సిన రైలు రద్దయింది.
- రైలు నంబర్ 06509 (కేఎస్‌ఆర్ బెంగళూరు – దానాపూర్): 2026 ఆగస్టు 3న ఈ సర్వీసును నిలిపివేశారు.
- రైలు నంబర్ 05073 (కేఎస్‌ఆర్ బెంగళూరు – లాల్ కువాన్): 2026 ఆగస్టు 4న ఈ రైలు ప్రయాణించదు.
- రైలు నంబర్ 06510 (దానాపూర్ – కేఎస్‌ఆర్ బెంగళూరు): 2026 ఆగస్టు 5న ఈ సర్వీసును పూర్తిగా రద్దు చేశారు.
పాక్షికంగా రద్దయిన రైళ్లు…
కొన్ని ముఖ్యమైన రైళ్లు కేఎస్‌ఆర్ బెంగళూరు స్టేషన్ వరకు వెళ్లకుండా మధ్యలోనే నిలిచిపోతాయి. మరికొన్ని తిరుగు ప్రయాణంలో మధ్యలోనే ప్రారంభమవుతాయి.
- భువనేశ్వర్ – కేఎస్‌ఆర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 18463): 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు నడిచే ఈ రైలును శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం (పుట్టపర్తి) స్టేషన్ వరకే పరిమితం చేశారు. అంటే ఈ రైలు బెంగళూరుకు వెళ్లకుండా ఏపీలోని పుట్టపర్తిలోనే ఆగిపోతుంది.
- కేఎస్‌ఆర్ బెంగళూరు – భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 18464): 2026 ఆగస్టు 1 నుండి ఆగస్టు 3 వరకు నడిచే ఈ రైలు కేఎస్‌ఆర్ బెంగళూరుకు బదులుగా శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ నుంచే తన తిరుగు ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.
దారి మళ్లించిన రైళ్లు
{{/usCountry}}కొన్ని ముఖ్యమైన రైళ్లు కేఎస్‌ఆర్ బెంగళూరు స్టేషన్ వరకు వెళ్లకుండా మధ్యలోనే నిలిచిపోతాయి. మరికొన్ని తిరుగు ప్రయాణంలో మధ్యలోనే ప్రారంభమవుతాయి.
- భువనేశ్వర్ – కేఎస్‌ఆర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 18463): 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు నడిచే ఈ రైలును శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం (పుట్టపర్తి) స్టేషన్ వరకే పరిమితం చేశారు. అంటే ఈ రైలు బెంగళూరుకు వెళ్లకుండా ఏపీలోని పుట్టపర్తిలోనే ఆగిపోతుంది.
- కేఎస్‌ఆర్ బెంగళూరు – భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 18464): 2026 ఆగస్టు 1 నుండి ఆగస్టు 3 వరకు నడిచే ఈ రైలు కేఎస్‌ఆర్ బెంగళూరుకు బదులుగా శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ నుంచే తన తిరుగు ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.
దారి మళ్లించిన రైళ్లు
{{/usCountry}}బెంగళూరు సిటీ స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన కొన్ని సుదూర ప్రాంతాల రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్థం ఇతర స్టేషన్ల గుండా మళ్లించారు. ఇవి కేఎస్‌ఆర్ బెంగళూరు స్టేషన్‌ను బైపాస్ చేస్తాయి:
- హౌరా – మైసూర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 22817): 2026 జూలై 3, 10, 17, 24, 31 తేదీల్లో బయలుదేరే ఈ రైలును ఎస్‌ఎంవీటీ బెంగళూరు (SMVT), బానసవాడి, హెబ్బాల్, యశ్వంతపూర్ మీదుగా మళ్లించారు.
- మైసూర్ – హౌరా ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 22818): 2026 జూన్ 21, 28, జూలై 5, 12, 19, 26 మరియు ఆగస్టు 2 తేదీల్లో ప్రయాణించే ఈ రైలును యశ్వంతపూర్, హెబ్బాల్, బానసవాడి మార్గంలో దారి మళ్లించారు.
ఈ తాత్కాలిక మార్పుల వల్ల ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తంచేసింది. యార్డ్ ఆధునికీకరణ పనుల వల్ల భవిష్యత్తులో రైళ్ల రాకపోకలు మరింత వేగవంతం అవుతాయని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణానికి సిద్ధమయ్యే వారు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 లేదా జాతీయ రైల్వే విచారణ వ్యవస్థ (NTES) యాప్ ద్వారా ట్రైన్ స్టేటస్ వివరాలను ఒకసారి సరిచూసుకోవాలని కోరారు.