...
...
Next Story

TTD Temples : మే 14 వ తేదీన టీటీడీ ఆలయాల్లోని మిక్స్‌డ్‌ రైస్ ఈ - వేలం

TTD : తిరుమల శ్రీవారి ఆలయంతోపాటుగా టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాల్లో మిక్స్‌డ్ రైస్ ఈ వేలం జరగనుంది. ఈ మేరకు తిరుమల దేవస్థానం బోర్డు ప్రకటన విడుదల చేసింది.

Published on: May 3, 2026, 14:05:07 IST
Advertisement

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు హుండి ద్వారా సమర్పించిన బియ్యాన్ని మే 14న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. మొత్తం 41 లాట్లుగా ఉన్న మిక్స్‌డ్‌ రైస్‌లో ఉదయం సెషన్‌లో 21 లాట్లు, మధ్యాహ్నం సెషన్‌లో 20 లాట్లు కలిపి సుమారు 16,338 కిలోల బియ్యాన్ని ఈ-వేలంలో ఉంచనున్నారు.

మిక్స్‌డ్‌ రైస్ ఈ - వేలం
మిక్స్‌డ్‌ రైస్ ఈ - వేలం

ఈ వేలంలో పాల్గొనాలనుకునే ఆసక్తి గల వారు ఉదయం, మధ్యాహ్నం సెషన్‌లకు విడివిడిగా మే 13వ తేదీ సాయంత్రం లోపు ఆన్‌లైన్‌లో konugolu పోర్టల్ ద్వారా ప్రతి సెషన్‌కు రూ.50,000 ఈఎండీ (EMD) చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చు. ఫోన్: 0877-2264429. అలాగే టీటీడీ వెబ్‌సైట్‌ www.konugolu.ap.gov.in సంప్రదించగలరు.

శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాలలో 2026–27 అడ్మిషన్లు ప్రారంభం

టీటీడీ ఆధ్వర్యంలోని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళాశాలలో 2026–2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 4 సంవత్సరాల డిప్లొమా కోర్సు, 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సులకు మే 04వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు దరఖాస్తులను జారీ చేసి, స్వీకరించనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను కళాశాలలో నేరుగా పొందవచ్చు లేదా టీటీడీ వెబ్‌సైట్‌లో డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 20వ తేదీ సాయంత్రం లోపు అందజేయాలి.

ప్రవేశం పొందిన విద్యార్థుల పేరిట టీటీడీ రూ.1 లక్షను జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేసి, కోర్సు పూర్తి చేసిన తరువాత నిబంధనల ప్రకారం వడ్డీతో సహా అందజేస్తుంది.

కోర్సుల వివరాలు

ప్రతి విభాగంలో సంవత్సరానికి 10 మంది చొప్పున, మొత్తం 60 మందికి ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. చివరి సంవత్సరం విద్యార్థులకు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాల సందర్శన కూడా కల్పిస్తారు.

సంప్రదాయ కలంకారి కళ (2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు)

వస్త్రాలపై సంప్రదాయ చిత్రకళలో శిక్షణనిచ్చే ఈ కోర్సులో ప్రతి సంవత్సరం 10 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఉచిత వసతి, భోజనంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. దేశ విదేశాల్లో కలంకారి కళకు మంచి డిమాండ్ ఉంది.

ప్రవేశ విధానం

రాష్ట్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు మే 04 నుండి జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉపాధి అవకాశాలు

ఈ సంస్థలో శిక్షణ పొందిన వారు టీటీడీ ఆలయ నిర్మాణ, పునర్నిర్మాణ విభాగాల్లో స్థపతులు, టెక్నికల్ అసిస్టెంట్లు, కాంట్రాక్టర్లు దేవాదాయ, పర్యాటక, పురావస్తు శాఖల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. అంతేకాక, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకుంటున్నారు.

ఇతర వివరాలకు.. శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థ, తిరుమల తిరుపతి దేవస్థానములు, అలిపిరి రోడ్, తిరుపతి – 517507, వెబ్‌సైట్: www.tirumala.org, ఫోన్: 0877-2264637 సంప్రదించవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe