...
...
Next Story

ఏపీలో ‘సర్‌’ గడువు పొడిగింపు - అక్టోబర్‌ 9న తుది ఓటర్ల జాబితా విడుదల

Special Intensive Revision AP : ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును ఈ నెల 10 వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ మేరకు కొత్త షెడ్యూల్ ఖరారైంది.

Published on: Sep 2, 2026, 06:54:13 IST
Advertisement

Special Intensive Revision AP : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో భాగంగా క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10 వరకు ఈసీ పొడిగించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు ఈ గడువు ఆగస్టు 30తో ముగిసింది. మరికొంత సమయం ఇవ్వాలంటూ వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఈసీ… ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఏపీలో ‘సర్‌’ గడువు పొడిగింపు
ఏపీలో ‘సర్‌’ గడువు పొడిగింపు

అర్హులైన ఓటర్లెవరూ జాబితా నుంచి తొలగిపోకుండా, తిరిగి తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ఈ 11 రోజుల అదనపు సమయాన్ని కేటాయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వివేక్ యాదవ్ మంగళవారం (సెప్టెంబరు 1) ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు.

తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…… జూలై 31న ప్రారంభమైన ఈ క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ గడువు ఆగస్టు 30తో ముగియాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయి పరిశీలనలో పలువురు అర్హులైన పౌరులకు ఇంకా సమయం అవసరమని గుర్తించారు. వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు, జిల్లాల కలెక్టర్లు (జిల్లా ఎన్నికల అధికారులు) నుంచి వచ్చిన అభ్యర్థనలను సీఈఓ వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వినతులపై సానుకూలంగా స్పందించిన కేంద్రం ఎన్నికల సంఘం…. సవరించిన షెడ్యూల్‌కు ఆమోదం తెలిపింది.

"2026 జూలై 1 నాటికి అర్హత కలిగిన పౌరులందరినీ పరిగణనలోకి తీసుకుంటూ, రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాల స్వీకరణ సమయాన్ని సెప్టెంబరు 10వ తేదీ వరకు పొడిగించాం" అని సీఈఓ వివేక్ యాదవ్ పేర్కొన్నారు.

  • నోటీసుల జారీ, క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాల పరిష్కార గడువును అక్టోబరు 5 వరకు పొడిగించారు.
  • అక్టోబరు 9న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు.

ఓటర్లు ఏం చేయాలి…?

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe