ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. రానివారికి కూడా వీటిని అందజేస్తున్నారు. కొత్తగా కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈకేవైసీ లేని కార్డులను పక్కన పెట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎప్పటికప్పుడు రేషన్ పంపిణీ కేంద్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. పలు జిల్లాల్లో ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది.
ఈకేవైసీ తప్పనిసరి…!

స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన వారు… ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ-కేవైసీ చేయించుకోలేదు. ఈ ప్రాసెస్ వారి రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది. వేలిముద్ర ద్వారా లబ్ధిదారుని ధ్రువీకరించే ప్రక్రియనే ఈకైవీసీ అంటారు. దీంతో నకిలీ రేషన్ కార్డులను పూర్తిగా తొలగించవచ్చు.
ఈకేవైసీ పకడ్బందీగా నిర్వహించటం ద్వారా… నకిలీ లబ్ధిదారులను ఏరివేస్తారు. సరుకుల పంపిణీ పారదర్శకంగా ఉంటుంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ఈకేవైసీ సమాచారాన్ని సేకరిస్తోంది.
రేషన్ డీలర్ షాప్ లో ఈకేవైసీ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.గ్రామ / వార్డు సచివాలయాల్లో కూడా ఈ ప్రాసెస్ చేస్తారు.E-PoS(ఈ పోస్) యంత్రంలో వేలిముద్ర పెట్టగానే E-KYC పూర్తవుతుంది. మరోవైపు కార్డు ఇప్పటివరకు తీసుకొనివారు.. ఆయా రేషన్ షాపుల వద్దకు తీసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
కాబట్టి ఈకేవైసీ విషయంలో లబ్ధిదారులు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా… 3 నెలలుగా రేషన్ తీసుకోకుండా ఉండొద్దు, ఈ 2 విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే కార్డు రద్దవుతోంది.
ఈకేవైసీ స్టేటస్‌ను ఆన్లైన్లోనే సొంతంగానే తెలుసుకోవచ్చు. రేషన్ డీలర్, ఎండీయూ వాహనంలో ఈపోస్ యంత్రంలో మీ రేషన్ కార్డు వివరాలు నమోదు చేస్తే సభ్యుల వివరాలన్నీ వస్తాయి. ఎరుపు రంగు గడియలో పేర్లు ఉంటే ఈకేవైసీ అప్డేట్ కానట్లే. అదే ఆకుపచ్చ రంగులో ఉంటే వారిది ఈకేవైసీ పూర్తి అయినట్లే. ఎరుపు రంగు గడిలో పేరు ఉన్నవారు వేలిముద్ర వేస్తే వారి ఈకేవైసీ పూర్తి అవుతుంది.
ఈకేవైసీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి:
- ఆన్లైన్లో ఈకేవైసీ స్టేటస్‌ను చెక్ చేయాలంటే.. https://epdsap.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఏపీ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
- ఇందులో ఈపీడీఎస్ అని ఉంటుంది. దానిలో రేషన్ కార్డు విభాగంలో ఆరు ఆప్షన్లు కనిపిస్తాయి.
- ఇక "epds application search", "rice card search" అని ఉంటాయి. ఆ రెండింటిలో ఒక అప్షన్‌ను క్లిక్ చేయాలి.
- ఇక్కడ రేషన్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయాలి. అప్పుడు రేషన్ కార్డులోని లబ్ధిదారుల పేర్లు వస్తాయి.
- పేర్ల ఎదురుగా చివరిలో ఎస్ అని ఉంటే ఈకేవైసీ అయినట్లు, నో అని ఉంటే ఈకేవైసీ కానట్లు. ఈకేవైసీ కాకపోతే వేలిముద్ర వేస్తే ఈకేవైసీ అవుతుంది.