ఏపీ పరిషత్ ఎన్నికల అర్హుల జాబితా విడుదల.. 50,815 నామినేషన్లు ఓకే!

ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో అర్హుల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మొత్తం 50,815 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యేలా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Published on: Oct 25, 2026, 21:51:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల సందడి కీలక ఘట్టానికి చేరుకుంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల ప్రక్రియ పూర్తి కావడంతో అర్హులైన అభ్యర్థుల తుది వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా దాఖలైన దరఖాస్తులలో పరిశీలన అనంతరం మొత్తం 50,815 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా, చెల్లుబాటు అయ్యేలా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

పరిషత్ సమరంలో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన, భారతీయ జనతా పార్టీల అభ్యర్థులు పెద్ద సంఖ్యలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.

ఎంపీటీసీ నామినేషన్ల వివరాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్ల చెల్లుబాటు జాబితా ఇలా ఉంది.

తెలుగుదేశం పార్టీ (TDP): 19,760 నామినేషన్లు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP): 17,726 నామినేషన్లు

జనసేన పార్టీ (JSP): 4,330 నామినేషన్లు

భారతీయ జనతా పార్టీ (BJP): 1,049 నామినేషన్లు

జడ్పీటీసీ నామినేషన్ల వివరాలు

జడ్పీటీసీ స్థానాల్లో హోరాహోరీ పోరుకు పార్టీలు సమాయత్తమయ్యాయి. చెల్లుబాటు అయిన నామినేషన్ల లెక్కలు చూస్తే..

తెలుగుదేశం పార్టీ: 1,693 నామినేషన్లు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ: 1,445 నామినేషన్లు

జనసేన పార్టీ: 587 నామినేషన్లు

భారత జాతీయ కాంగ్రెస్ (INC): 316 నామినేషన్లు

భారతీయ జనతా పార్టీ: 227 నామినేషన్లు

విశాఖ మేయర్ బరిలో 15 మంది అభ్యర్థులు

మరోవైపు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం పోరు సైతం ఆసక్తిగా మారింది. విశాఖ మేయర్ ఎన్నికల బరిలో చివరికి 15 మంది అభ్యర్థులు నిలిచారని అధికారులు వెల్లడించారు. మెుత్తం 29 నామినేషన్లు దాఖలు కాగా.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 8 నామినేషన్లను రిటర్నింగ్ తిరస్కరించారు. మిగిలిన 21 చెల్లుబాటైన నామినేషన్లలో ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

వంగవీటి రాధా.. ఏబీవీ ఆలింగనం

విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో ఆదివారం నాటి ప్రచార పర్వంలో పొలిటికల్ హీట్‌ను పక్కన పెట్టి ఓ అరుదైన, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నగరంలోని గుణదల ప్రాంతంలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్న ప్రముఖ నేత వంగవీటి రాధాకృష్ణ, అదే మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఒకరినొకరు ఎదురెదురుగా కలిశారు.

కూటమి నేతలతో కలిసి వంగవీటి రాధాకృష్ణ వాహనంపై వెళ్తూ గుణదలలో ముమ్మరంగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాధాను చూసి ప్రేమగా పిలిచారు. ఏబీవీ పిలుపు విని వెంటనే స్పందించిన రాధాకృష్ణ, ప్రచార వాహనం నుంచి కిందకు దిగి ఆయన వద్దకు వెళ్లారు.

పరస్పరం నవ్వుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న ఇద్దరు నేతలు, కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. మేయర్ పీఠం కోసం ప్రత్యర్థులుగా పోటీ పడుతున్న ఇద్దరు కీలక వ్యక్తులు ఇలా రాజకీయాన్ని పక్కన పెట్టి ఆప్యాయంగా పలకరించుకోవడం ప్రచారంలో ఉన్న నాయకులను, అక్కడి ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More