రాబోయే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు యూనిట్‌పై రూ.1.19 వరకు తగ్గింపు : మంత్రి గొట్టిపాటి

ప్రభుత్వ సంస్కరణలతోనే డిస్కంలకు దేశస్థాయిలో మెరుగైన రేటింగ్స్ సాధించాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలను యూనిట్‌పై రూ.1.19 మేర తగ్గించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Published on: Jan 25, 2026, 20:10:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వైసీపీ హయాంలో నిర్వీర్యమైన రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం పునర్జీవనం పోసిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర విద్యుత్ సంస్కరణల ఫలితంగానే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) దేశ స్థాయిలో మెరుగైన రేటింగ్‌లు సాధించాయని మంత్రి తెలిపారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ విడుదల చేసిన తాజా వార్షిక నివేదికలో రాష్ట్ర డిస్కంల పనితీరుకు ఉన్నత రేటింగ్‌లు లభించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

మంత్రి గొట్టిపాటి రవికుమార్
మంత్రి గొట్టిపాటి రవికుమార్

గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం విద్యుత్ రంగాన్ని నాశనం చేసిందని, అప్పుల ఊబిలో ముంచి డిస్కంలను నిర్వీర్యం చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి గుర్తు చేశారు. సాంకేతిక, వాణిజ్య నష్టాలను గణనీయంగా తగ్గించడం, విద్యుత్ బిల్లుల వసూలు సామర్థ్యాన్ని పెంచడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీలను జాప్యం లేకుండా విడుదల చేయడం వంటి చర్యలతో డిస్కంల పనితీరు మెరుగుపడిందని తెలిపారు.

ఇవే దేశ స్థాయిలో రేటింగ్‌లు పెరగడానికి కారణమని మంత్రి స్పష్టం చేశారు. ఈ విజయానికి కారణమైన విద్యుత్ శాఖ ఉద్యోగులు, ఇంజినీర్లు, ఫీల్డ్ సిబ్బందిని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఉద్యోగి అంకితభావంతో, రెట్టింపు ఉత్సాహంతో పని చేయడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. భవిష్యత్తులో డిస్కంల రేటింగ్‌లు మరింత మెరుగయ్యేలా అదే స్ఫూర్తితో పని చేయాలని సూచించారు.

'గృహ, పారిశ్రామిక, వ్యవసాయ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా రాబోయే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలను యూనిట్‌పై రూ.1.19 మేర తగ్గించే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టంగా కృషి చేస్తోంది. విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా ప్రజలపై భారం తగ్గించే విధానాలనే కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుంది.' అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More