టీటీడీలోని ఆ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మరో రెండేళ్లు క్రెడిట్ వైద్య సౌకర్యాలు

ఎస్వీబీసీ హెచ్‌డీ ఛానల్ క్వాలిటీతో శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన ప్రసారాలు అందించనున్నట్టుగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇందులోని ఉద్యోగులకు మరో రెండేళ్లపాటు క్రెడిట్ వైద్య సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

Published on: Dec 23, 2025, 13:33:00 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు శ్రీవారి వైభవాన్ని, కైంకర్యాలను హెచ్‌డీ ఛానల్ క్వాలిటీతో ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రసారాలను అందించాలని అధికారులను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్

ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. ఎస్వీబీసీ కార్యక్రమాలు మరింత నాణ్యంగా అందించేందుకు ఎస్వీబీసీ హెచ్‌డీ ఛానల్ అప్‌లింకింగ్ , డౌన్‌లింకింగ్ కోసం అదనపు ఉపగ్రహ బ్యాండ్‌విడ్త్ కేటాయింపునకు సంబంధించి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు అవసరమైన దరఖాస్తులు చేయాలని సూచించారు. హెచ్‌డీ ఛానల్ నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

అదేవిధంగా ఎస్వీబీసీ ఛానల్‌లో ఇప్పటి వరకు గంటకు స్పాన్సర్డ్ స్పాట్‌లు 12 సెకన్లు మాత్రమే ఇస్తున్నారని, వాటిని 60 సెకన్ల వరకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్వీబీసీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు స్విమ్స్‌లో సాధారణ వైద్య చికిత్సలు, అరవింద్ ఐ హాస్పెటల్‌లో కంటి వైద్య చికిత్సల కోసం మరో రెండేళ్లపాటు క్రెడిట్ వైద్య సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

ఎస్వీబీసీ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారం మరో రెండేళ్లపాటు క్రెడిట్ వైద్య సౌకర్యాలు కల్పించేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకోవాలని ఈవో సూచించారు.

టీటీడీలో అన్యమతస్తులపై చర్యలు తీసుకోవడంలో భాగంగా ఎస్వీబీసీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న అవాద్ బిన్ మొహ్సిన్ సనాజీ, ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న ఎం.డి. ఖైసర్ పాషాలు వారి రికార్డుల్లో ముస్లిం వర్గాలుగా నమోదైనందున వారి కాంట్రాక్ట్ గడువు 31.12.2025తో ముగిసిన అనంతరం వారి సేవలను కొనసాగించరాదని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీబీసీ బోర్డు సభ్యులు బీ. ఆనంద సాయి, ఎం.ఎస్. రాజులు వర్చువల్‌గా పాల్గొనగా, ఎస్వీబీసీ ఇంఛార్జి సీఈవో డి. పణికుమార్ నాయుడు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More