ఏపీలో దీపం పథకం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. పైప్డ్ నేచురల్ గ్యాస్‌కు(పీఎన్జీ) దీపం పథకం లబ్ధిదారులు మారినా.. రాయితీ సొమ్మును వారి బ్యాంకు అకౌంట్లోకి వేస్తామన్నారు. ఎల్పీజీపై కొన్ని రోజులుగా ఆందోళనలు నెలకొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

పశ్చి్మాసియా ఉద్రిక్తతల కారణంగా తలత్తిన ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు మరింత సన్నద్దతతో పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు, ఆయిల్ కంపెనీలకు సూచించారు. పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
దీపం పథకం లబ్ధిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన కల్పించాలని చంద్రబాబు అన్నారు. దీపం పథకం లబ్ధిదారులు పీఎన్జీకి మారితే.. వారికి దీపం పథకం కింద ఇచ్చే రాయితీ సొమ్మును జమ చేసేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని... దీనిపై వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పీఎన్జీ కనెక్షన్ తీసుకున్నా దీపం పథకం ద్వారా కలిగే లబ్ధి పొందవచ్చన్న విషయంపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు.
గ్యాస్ సరఫరా ఇబ్బందులను అధిగమించడానికి ఆయిల్ కంపెనీలు పీఎన్జీ కనెక్షన్లను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలపై చంద్రబాబు మాట్లాడారు. వచ్చే 6 నెలల్లో మొత్తం 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని... ఈ విషయంలో జాప్యం ఉండకూడదని, టార్గెట్ ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ కాకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. గృహ అవసరాలకు సంబంధించి గ్యాస్ సరఫరాలో సమస్యలను అధిగమించామని తెలిపారు. డొమెస్టిక్ పంపిణీకి సంబంధించి సమస్యను తగ్గించామని... త్వరలో సాధారణ స్థితికి తీసుకువస్తామన్నారు. శ్రీకాకుళం - కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పనుల్లో జాప్యంపై సీఎం అధికారుల వివరణ కోరారు. దీనికి సంబంధించి కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అధికారులు చెప్పడంతో... సమీక్ష నుంచే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ముఖ్యమంత్రి ఫోన్ చేశారు.
ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అయినందున వెంటనే పనులు పూర్తి చేసేలా చూడాలని చంద్రబాబు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
{{/usCountry}}ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అయినందున వెంటనే పనులు పూర్తి చేసేలా చూడాలని చంద్రబాబు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
{{/usCountry}}