చేతిలో క్యాష్ లేకున్నా తిరుమల లడ్డూలు పొందవచ్చు.. టీటీడీ మరో ఆలోచన

తిరుమలకు వచ్చే భక్తులకు గుడ్‌న్యూస్. తిరుమల లడ్డూలు పొందడానికి టీటీడీ మరో ఆలోచన చేస్తోంది. లడ్డూ కౌంటర్‌ల దగ్గర యూపీఐ పేమెంట్ ఆప్షన్‌ తీసుకువచ్చేందుకు పరిశీలన చేస్తోంది.

Published on: Feb 9, 2026, 11:02:35 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమలకు వచ్చారంటే.. లడ్డూలు తీసుకోకుండా ఏ ఒక్క భక్తుడూ వెళ్లడు. తిరుమల లడ్డూలు దేశవ్యాప్తంగా ఫేమస్. శ్రీవారి ప్రసాదం రుచిలో కూడా అమోఘం. అయితే లడ్డూల కోసం క్యూలైన్లలో నిలుచున్నప్పుడ్డు చేతిలో డబ్బులు పట్టుకోవాల్సిన పరిస్థితి. దీంతో టీటీడీ మరో ఆలోచన చేస్తోంది. లడ్డూ విక్రయ కేంద్రంలోని ప్రతీ కౌంటర్ వద్ద యూపీఐ పేమెంట్ అవకాశం కల్పించేందుకు ప్రణాళికలు వేస్తోంది.

తిరుమల
తిరుమల

తిరుమలలో ప్రతీ ఏడాది లడ్డూ విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయి. కౌంటర్ వద్ద డబ్బులు లేవని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. భక్తులు పడుతున్న ఇబ్బందులు చూసిన టీటీడీ కొత్త ఆలోచన చేస్తోంది. లడ్డూ విక్రయ కేంద్రాల్లో యూపీఐ పేమెంట్‌కు అవకాశం కల్పించాలని చూస్తోంది. దీంతో కౌంటర్ల వద్ద భక్తులు నగదు చెల్లించి.. లడ్డూలు పొందే ఇబ్బంది తప్పుతుంది. చాలా మంది ఇప్పుడు పేమెంట్స్ ఎక్కువగా యూపీఐ ద్వారానే చేస్తున్నారు.

ఇప్పటికే లడ్డూ విక్రయ కేంద్రంలో కియోస్క్ యంత్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. వీటిద్వారా కావాల్సిన లడ్డూల సంఖ్య ఎంపిక చేసి యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే వచ్చే రశీదు ఆధారంగా కౌంటర్‌లో లడ్డూలు తీసుకోవచ్చు. అయితే చాలామంది యూపీఐ పేమెంట్స్ చేస్తుండటంతో యంత్రాల వద్ద రద్దీ అధికం అవుతుంది. అంతేకాదు చాలావరకు యంత్రాలు సౌంకేతిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ఇలాంటి సమయంలో చాలామంది భక్తులు.. యంత్రాల వద్ద ఉండటం కంటే డబ్బులతో క్యూలైన్ల వద్ద నిలుచునేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. అయితే చేతిలో డబ్బులు లేనివారు మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అక్కడకు వచ్చిన ఇతర భక్తుల దగ్గరకు వెళ్లి యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తాం.. చేతికి క్యాష్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకుంటున్న ఘటనలు చూడవచ్చు.

ఇక భక్తులు ఎలాంటి సమస్యలూ లేకుండా.. లడ్డూ కౌంటర్ల వద్దే పేమెంట్ క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేసేందుకు టీటీడీ అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. దీనిద్వారా భక్తుల చేతిలో డబ్బులు లేకపోయినా తిరుమల లడ్డూ తీసుకోవచ్చు. యూపీఐ పేమెంట్ చేసి శ్రీవారి లడ్డూలను అందుకోవచ్చు. ఈ పద్ధతితో కియోస్క్ యంత్రాల దగ్గర నిల్చోవల్సిన అవసరం ఉండదని అధికారులు భావిస్తున్నారు.

అంతేకాదు నేరుగా కౌంటర్‌లోనే లడ్డూ పొందవచ్చు. ఈ సర్వీస్ ఇచ్చేందుకు ఒక బ్యాంకు కూడా ముందుకు వచ్చినట్టుగా చర్చ నడుస్తోంది. మెుదట ప్రయోగత్మకంగా కొన్ని లడ్డూ కౌంటర్లలో ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత భక్తుల ఫీడ్ బ్యాక్, ఫలితాల ఆధారంగా అన్ని కౌంటర్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఆలోచనలు చేస్తోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More