...
...
Next Story

Kavuri Samba Siva Rao : మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు ఆరోగ్య పరిస్థితి విషమం

Kavuri Samba Siva Rao : మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..

Published on: Mar 9, 2026, 14:35:53 IST
Advertisement

మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ నుంచి 5 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు సాంబశివరావు. 2013లో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం దోసపాడు గ్రామం.

మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు(ఫైల్ ఫొటో)
మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు(ఫైల్ ఫొటో)

ఆయన ఆరోగ్య పరిస్థితిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కావూరి సాంబశివరావు మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మూడు సార్లు, ఏలూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికై సేవలు అందించారు. కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

కావూరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు. కావూరి సాంబశివరావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రాజకీయ జీవితంలో ఆయన ఐదు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ప్రజలకు సేవలందించారు.

యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో కావూరి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పని చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ.. ప్రగతి ప్రగతి కన్స్ట్రక్షన్స్ స్థాపించారు. ఇందులో విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు దూరం అవుతూ వచ్చారు. సమైక్య రాష్ట్రం కోసం బలంగా గళం విప్పిన నేతల్లో కావూరి ఒకరు.

కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ నేతలతో మంచి సంబంధాలు కలిగి ఉండేవారు కావూరి. తాజాగా ఆయన ఆసుపత్రిలో చేరారు అన్న వార్త తెలియగానే ఉమ్మడి రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు, ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కావూరి త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మంత్రి నారా లోకేశ్ కూడా రెండురోజుల కిందట కావూరిని పరామర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe