Musi River Rejuvenation : గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు..? ప్రభుత్వ లెక్కలివే

మూసీ నది పునరుజ్జీవనంలో భాగంగా బాపూఘాట్ వద్ద ప్రతిష్టాత్మకంగా “గాంధీ సరోవర్” ప్రాజెక్ట్ ను చేపట్టేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్ కోసం భూసేకరణ చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్  ఖర్చు వివరాలపై ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చింది.

Published on: Mar 8, 2026, 12:50:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మూసీ నది పునరుజ్జీవనంలో భాగంగా హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రతిష్టాత్మకంగా “గాంధీ సరోవర్” ప్రాజెక్ట్ ను చేపట్టేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్ కోసం కావాల్సిన భూమిని సేకరిస్తోంది. అయితే పలు నివాస ప్రాంతాలను కూడా ఖాళీ చేయించే దిశగా కసరత్తు చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పేరుతో లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటిపై స్పందించిన ప్రభుత్వం… వివరణ ఇస్తూ ఓ క్లారిటీ ఇచ్చింది.

గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ - ఖర్చుపై తెలంగాణ ప్రభుత్వం వివరణ
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ - ఖర్చుపై తెలంగాణ ప్రభుత్వం వివరణ

మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం…. మొదటి దశలో అంచనా వేసిన ఖర్చును రూ. 5,812.4 కోట్లుగా పేర్కొంది. జోన్ 1 (హిమాయత్ సాగర్ → గాంధీ సరోవర్) కోసం రూ. 1,684 కోట్లు, జోన్ 2 (ఉస్మాన్ సాగర్ - గాంధీ సరోవర్) కోసం రూ. 1,992 కోట్లు ఖర్చు చేయనుంది. ఇక పన్నులు ,ఇతర నిబంధనలు, పనుల నిమిత్తం రూ. 1,596 కోట్లు కేటాయించనుంది.

గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ - ప్రభుత్వం పేర్కొన్న అంశాలు:

  • గాంధీ విగ్రహం - రూ. 73.8 కోట్లు
  • విగ్రహ పీఠం - రూ. 22.6 కోట్లు
  • మ్యూజియం, విగ్రహ భవనం: రూ. 220 కోట్లు
  • విద్యుత్, మెకానికల్ పనులు: రూ. 79 కోట్లు

ఈ అంశాలన్నీ కూడా మొత్తం నదీ తీర అభివృద్ధి ప్రణాళికలో భాగమే అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. నదీ పర్యావరణ పునరుద్ధరణ, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, వరద నిర్వహణ, డ్రైనేజీ మెరుగుదల, నదీ తీరంలో బహిరంగ ప్రదేశాలు, సైక్లింగ్ ట్రాక్‌లు, వంతెనలు, రిటైనింగ్ వాల్స్, ట్రంక్ సివరేజ్ లైన్ల వంటి అర్బన్ మౌలిక సదుపాయాలపై వంటి అంశాలపై దృష్టి సారిస్తామని పేర్కొంది. ఈ ప్రాజెక్టును అత్యంత పారదర్శక విలువలతో, ఒక ప్రణాళికా బద్దంగా, వివిధ దశల వారీగా పూర్తి చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

గాంధీ సరోవర్ అనేది మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమంలో ఒక భాగం మాత్రమే అని సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఇందులో గాంధీ విగ్రహానికి సంబంధించి అంచనా వేసిన ఖర్చు రూ. 73.8 కోట్లు మాత్రమే అని వివరించింది. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించి సరైన సమాచారం కోసం అధికారిక ప్రాజెక్ట్ పత్రాలను లేదా ప్రభుత్వ ప్రకటనలను మాత్రమే అధికారిక సమాచారంగా భావించాలని కోరింది. తప్పుడు సమాచారాన్ని, ఫేక్ న్యూస్ ను, ఉద్దేశ్య పూర్వకంగా చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More